AC and Refrigerators: ఏసీ, రిఫ్రిజిరేటర్ తయారీదారులకు పీక్ సీజన్‌లో రెండో సంవత్సరం కూడా తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. కరోనా కారణంగా గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో షాక్ తర్వాత ఈ కంపెనీలకు ఈ సంవత్సరం కూడా షాకిచ్చింది. వారి అమ్మకాలు బాగా తగ్గుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా లాక్డౌన్లు , పరిమితుల ఇబ్బందులతో పీక్ సీజన్ గా చెప్పుకునే ఏప్రిల్, మే నెలలలో ఎయిర్ కండిషనర్లు (ఏసీ), రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు బాగా ప్రభావితమయ్యాయి. వరుసగా రెండో ఏడాది ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 2019 తో పోలిస్తే ఈ ఏడాది 75 % పడిపోయాయి. వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్, పానాసోనిక్, హెయిర్‌తో సహా ఈ విభాగంలో ప్రధాన కంపెనీలు 2019 తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ అమ్మకాలలో దాదాపు 75% క్షీణతను చవి చూశాయి.
ప్రముఖ ఏసీ తయారీదారు వోల్టాస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 10% కంటే ఎక్కువ అమ్మకాలను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు రెండవ వేవ్, పరిమితుల కారణంగా మళ్లీ లక్ష్యాలను మార్చుకున్నారు. వోల్టాస్ ఎండి సిఇఒ ప్రదీప్ బక్షి మాట్లాడుతూ ప్రారంభంలో బడ్జెట్ చేసేటప్పుడు 10% చొప్పున ఎదగడానికి చాలా అవకాశం ఉన్నట్లు కనిపించింది. కాని ఇప్పుడు మొదటి త్రైమాసికం తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఇప్పుడు కనీసం మనం గత సంవత్సరం పనితీరును అయినా పునరావృతం చేయాల్సి ఉంటుంది అన్నారు.
డైకిన్ ఎయిర్‌కండిషనింగ్ ఇండియా ఎండి సిఇఒ కన్వాల్ జీత్ జావా మాట్లాడుతూ, గత సంవత్సరం ఏప్రిల్ వ్యాపారం జరగలేదు. మేలో 10% అమ్మకాలు మాత్రమే జరిగాయి. జూన్ లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమ్మకాలు కాస్త బావున్నట్టు అనిపించినా మే వచ్చేసరికి పడిపోయాయి. మే పూర్తి వాష్‌అవుట్‌లా కనిపిస్తుందని జావా చెప్పారు.
పానాసోనిక్ ఇండియా మరియు సౌత్ ఆసియా సిఇఒ మనీష్ శర్మ మాట్లాడుతూ మార్చిలో ఏసీ అమ్మకాలు ప్రారంభమయ్యాయని, అయితే కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరగడం మరియు చాలా రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్లను ఉంచడం వల్ల వేసవిలో రెండవ వేవ్ అమ్మకాలను ప్రభావితం చేస్తోంది. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము, అయితే, ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్), అమ్మకాల అంచనా 50% వరకూ తగ్గవచ్చు అన్నారు.
సాధారణంగా, ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో వేసవి కాలం గణనీయంగా పెరుగుతుంది. సంవత్సరంలో మొత్తం అమ్మకాలలో 30 నుండి 35% ఒకే కాలంలో ఉండటానికి కారణం ఇదే. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్స్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) ప్రకారం, శీతలీకరణ ఉత్పత్తుల గరిష్ట అమ్మకాల కాలంగా పరిగణించబడే మే నెల మొత్తం ఈ సంవత్సరం తుడిచిపెట్టుకు పోయినట్టే. ఎందుకంటే మార్కెట్ 15% మాత్రమే తెరిచి ఉంది అలాగే దుకాణాలకు వచ్చేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.
సీమా అధ్యక్షుడు కమల్ నంది మాట్లాడుతూ, “నేను ప్రస్తుత ధోరణిని గమనిస్తున్నాను. ఇది గత సంవత్సరం మాదిరిగానే ఉంది.” అన్నారు. హైయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రెగన్జా ప్రకారం, ఈ లాక్డౌన్, కర్ఫ్యూ జూన్ వరకు పరిమితం చేయబడిండి. కానీ అప్పటికి వేసవి కాలం ముగిసిపోతుంది. అలాగే, ఏసీ, ఫ్రిజ్ ల కంపెనీలకు ఇది ఒక ముఖ్యమైన నెల. ఈనెల అమ్మకాలు కోల్పోతే, మీరు ఎప్పటికీ కోలుకోలేరు. ఎసి విభాగంలో వృద్ధి ఉండదని, ఇది గత సంవత్సరం మాదిరిగానే ఉంటుందని చెప్పారు.” మేము ఈ సంవత్సరం 2019 లా అమ్మకాలు కావాలని ఆశిస్తున్నాము. అయితే, ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే కనీసం 2020 సంవత్సరపు పనితీరును పునరావృతం చేస్తే అది మాకు మంచి విషయం అనిపిస్తోంది అని కమల్ నంది చెప్పారు.
బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి తియగరాజన్ మాట్లాడుతూ, సంవత్సరానికి 10 నుండి 15% పెరుగుదల ఉందని నేను అంచనా వేస్తున్నాను అన్నారు. రాబోయే కొద్ది త్రైమాసికాలలో వోల్టాస్ తన పాత వేగాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని బక్షి చెప్పారు. గత సంవత్సరంలో (2019-2020) మా పనితీరు పరంగా, ఇది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదైనా ఇప్పుడే చెప్పడం చాలా తొందరగా ఉంది. వేసవి కాలం పొడవుగా, తేమగా ఉండి జూలై వరకు కొనసాగితే కనుక పరిస్థితి కొంత మారొచ్చు. అయితే, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా రెసిడెన్షియల్ ఏసీల ధరలు పెరిగే అవకాశం ఉందని సియామా అధ్యక్షుడు నంది చెప్పుకొచ్చారు.
అదేవిధంగా, ధరల పెరుగుదల మరియు పరిమితుల కారణంగా రెండవ త్రైమాసికంలో కూడా సవాళ్లు కొనసాగుతాయని నంది చెప్పారు. గత సంవత్సరం మాదిరిగా కాకుండా, జూలై, ఆగస్టులలో మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో చెప్పే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ప్రజలు మూడవ వేవ్ గురించి మాట్లాడుతున్నారని హైయర్స్ బ్రెగాంజా హెచ్చరించారు. గత సంవత్సరం కరోనా తరువాత ప్రజలు భయపడలేదు. ఈ సంవత్సరం ప్రజల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. వైద్య ఖర్చులకు ఎంత డబ్బు అవసరమో తెలియకపోవడంతో ప్రజలు మూడవ వేవ్ భయం వలన డబ్బు ఆదా చేయబోతున్నారు. గత సంవత్సరం మార్కెట్ పనిచేసినట్లుగానే, ఈ సంవత్సరం కూడా అదే పునరావృతమవుతుందని నేను అనుకోను అని ఆయన అన్నారు.
Also Read: sebi: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ రూపంలో ట్రేడింగ్.. మార్గదర్శకాలను జారీ చేసిన సెబీ