Aadhaar Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఇన్‌యాక్టివ్‌గా మారుతుందా? కీలక సమాచారం

|

Jun 16, 2024 | 6:49 PM

ఆధార్‌.. ఇది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది లేనిది ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. ప్రతిదానికి ఆధార్‌ కావాల్సిందే. సిమ్‌ కార్డు తీసుకునేదాని నుంచి బ్యాంకు అకౌంట్‌ వరకు, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ పథకాలను ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే.. ఆధార్‌ లేనిది ఏ పని కూడా జరగదు. అయితే మీరు ఆధార్‌ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు అవుతుంటే..

Aadhaar Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఇన్‌యాక్టివ్‌గా మారుతుందా? కీలక సమాచారం
Aadhaar Card
Follow us on

ఆధార్‌.. ఇది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది లేనిది ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. ప్రతిదానికి ఆధార్‌ కావాల్సిందే. సిమ్‌ కార్డు తీసుకునేదాని నుంచి బ్యాంకు అకౌంట్‌ వరకు, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ పథకాలను ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే.. ఆధార్‌ లేనిది ఏ పని కూడా జరగదు. అయితే మీరు ఆధార్‌ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు అవుతుంటే వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి అని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అయితే ఇది వరకు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు జూన్‌ 14 వరకు గడువు ఉండేది. కానీ ఆ గడువును సెప్టెంబర్‌ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే గడువు దాటిన తర్వాత ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలంటే రూ.50 చెల్లించి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఆధార్ కార్డ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 10 సంవత్సరాల పాటు మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ కాకపోతే గడువు ముగిసిన తర్వాత కార్డు ఇన్‌యాక్టివ్‌గా మారుతుందని, అంటే దేనికి పనికి రాకుండా పోతుందని పుకార్లు షికార్లు అవుతున్నాయి. ఇలాంటి వార్తలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షాట్‌లలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది.ముందుగా ఈ వార్తల్లో నిజం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేద్దాం. ఆధార్ కార్డుకు సంబంధించి జూన్ 14వ తేదీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం?

UIDAI ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్‌ సౌకర్యం

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అనేక సార్లు ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి సంబంధించిన సమాచారాన్ని అందించింది. దీని ప్రకారం, మీరు 10 సంవత్సరాల పాటు మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయకుంటే, ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసే సదుపాయాన్ని UIDAI ఉచితంగా అందిస్తోంది. మీరు UIDAI పోర్టల్‌ని సందర్శించడం ద్వారా సెప్టెంబర్‌ 14 వరకు ఉచితంగా మీ ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆధార్ కేంద్రంలో రూ.50 ఫీజు :

మీరు మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయాలనుకుంటే, మీరు UIDAI వెబ్‌సైట్ లేదా ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా దీన్ని చేయవచ్చు. అయితే, దీని కోసం మీరు యూఐడీఏఐ పోర్టల్‌లో ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేసే ఉచిత సేవ యూఐడీఏఐ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్ కు వెళితే రుసుముగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. మీరు మీ 10 ఏళ్ల ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయాలనుకుంటే, వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయండి. ఎందుకంటే గడువు ముగిసిన తర్వాత, మీరు దాని కోసం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అప్‌డేట్‌ చేయకుంటే కార్డ్‌ పని చేయదా?

అప్‌డేట్‌ కోసం గడువు ముగిసిన తర్వాత ఆధార్ కార్డును మూసివేయబోమని UIDAI కూడా స్పష్టం చేసింది. ఇది మునుపటిలా ఉపయోగించవచ్చు. సెప్టెంబర్‌ 14 వరకు మాత్రమే ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి