దేశంలోని పౌరులందరికీ ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. ప్రతి ఆధార్ కార్డ్ హోల్డర్ తన గుర్తింపు రుజువు , చిరునామా పత్రాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిరంతరం తమ ఆధార్‌ను అప్‌డేట్ చేయమని అడుగుతోంది. ఆధార్ అప్‌డేట్ కోసం గుర్తింపు రుజువు (PoI), చిరునామా రుజువు పత్రాలు అవసరం. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడం ఆధార్ సంబంధిత మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే సరైన జనాభా సమాచారం కూడా అప్‌డేట్ అవుతుంది.
ఆధార్ అప్‌డేట్ చివరి తేదీ
MyAadhaar పోర్టల్‌లో ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ జూన్ 14, 2024. జూన్ 14 తర్వాత వ్యక్తులు ఫీజు చెల్లించడం ద్వారా మాత్రమే వారి గుర్తింపు, చిరునామా రుజువును అప్‌డేట్ చేయగలరు. ఇంతకుముందు UIDAI ఈ సదుపాయాన్ని 14 మార్చి 2024 వరకు ఉచితంగా ఉంది. అయితే తర్వాత గడువును జూన్ 14 వరకు పొడిగించింది.
ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం రుసుము
జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి ఎటువంటి రుసుము లేదు. అయితే మీరు భౌతిక ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా అప్‌డేట్ చేయడానికి రూ.50 చెల్లించాలి. జూన్ 14 తర్వాత, MyAadhaar పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ పత్రాలను అప్‌డేట్ చేయడానికి రూ.25 రుసుము వసూలు చేస్తుంది.
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడం ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి