AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Updates: మీ ఆధార్‌ను అప్‌డేట్‌ చేశారా? గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసా?

దేశంలోని పౌరులందరికీ ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. ప్రతి ఆధార్ కార్డ్ హోల్డర్ తన గుర్తింపు రుజువు , చిరునామా పత్రాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిరంతరం తమ ఆధార్‌ను అప్‌డేట్ చేయమని అడుగుతోంది. ఆధార్..

Aadhaar Updates: మీ ఆధార్‌ను అప్‌డేట్‌ చేశారా? గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసా?
Aadhaar Card
Subhash Goud
|

Updated on: May 11, 2024 | 5:16 PM

Share

దేశంలోని పౌరులందరికీ ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. ప్రతి ఆధార్ కార్డ్ హోల్డర్ తన గుర్తింపు రుజువు , చిరునామా పత్రాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిరంతరం తమ ఆధార్‌ను అప్‌డేట్ చేయమని అడుగుతోంది. ఆధార్ అప్‌డేట్ కోసం గుర్తింపు రుజువు (PoI), చిరునామా రుజువు పత్రాలు అవసరం. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడం ఆధార్ సంబంధిత మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే సరైన జనాభా సమాచారం కూడా అప్‌డేట్‌ అవుతుంది.

ఆధార్ అప్‌డేట్ చివరి తేదీ

MyAadhaar పోర్టల్‌లో ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ జూన్ 14, 2024. జూన్ 14 తర్వాత వ్యక్తులు ఫీజు చెల్లించడం ద్వారా మాత్రమే వారి గుర్తింపు, చిరునామా రుజువును అప్‌డేట్ చేయగలరు. ఇంతకుముందు UIDAI ఈ సదుపాయాన్ని 14 మార్చి 2024 వరకు ఉచితంగా ఉంది. అయితే తర్వాత గడువును జూన్ 14 వరకు పొడిగించింది.

ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం రుసుము

జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి ఎటువంటి రుసుము లేదు. అయితే మీరు భౌతిక ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా అప్‌డేట్ చేయడానికి రూ.50 చెల్లించాలి. జూన్ 14 తర్వాత, MyAadhaar పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ పత్రాలను అప్‌డేట్ చేయడానికి రూ.25 రుసుము వసూలు చేస్తుంది.

ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడం ఎలా?

  • ముందుగా myAadhaar పోర్టల్‌కి వెళ్లండి.
  • దీని తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి, ఆపై మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెండ్ OTP బటన్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత OTPని నమోదు చేసి, ఆపై లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • మార్గదర్శకాలను చదివిన తర్వాత, ‘తదుపరి’ బటన్‌పై నొక్కండి.
  • ‘వెరిఫై యువర్ డెమోగ్రాఫిక్ డిటెయిల్స్’ పేజీకి వెళ్లి, ‘పైన ఉన్న వివరాలు సరైనవని నేను వెరిఫై చేస్తున్నాను’ బాక్స్‌ను టిక్ చేసి, ఆపై ‘తదుపరి’పై క్లిక్ చేయండి.
  • ‘ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ’, ‘ప్రూఫ్ ఆఫ్ అడ్రస్’ పత్రాలను అప్‌లోడ్ చేసి, ఆపై ‘సమర్పించు’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీరు ఇప్పుడు ఇమెయిల్‌లో ‘సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN)’ నంబర్‌ను అందుకుంటారు. మీరు SRN ద్వారా మీ పత్రాల అప్‌డేట్‌ స్థితిని కూడా ట్రాక్ చేయవచ్చు.
  • మీ ఆధార్ కార్డ్ వివరాలు 7 పని దినాలలో అప్‌డేట్ అవుతాయని గుర్తుంచుకోండి. మీరు అన్ని పత్రాలను సరిగ్గా ఇచ్చినట్లయితే అప్‌డేట్‌ అవుతాయి. సరైన వివరాలు అందించకుంటే అప్‌డేట్‌ కాదని గుర్తించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
మీ లైఫ్‌ను టర్న్ చేసే బెస్ట్ మోటివేషనల్ టిప్స్ ఇవి!
మీ లైఫ్‌ను టర్న్ చేసే బెస్ట్ మోటివేషనల్ టిప్స్ ఇవి!
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన గిల్ నయా ‘బ్రహ్మాస్త్రం
టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన గిల్ నయా ‘బ్రహ్మాస్త్రం
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
ఫ్రిజ్‌‌లోని నీళ్లు తాగడం ఎంత డేంజరో తెలుసా ?మీ పొట్ట ప్రమాదంలో
ఫ్రిజ్‌‌లోని నీళ్లు తాగడం ఎంత డేంజరో తెలుసా ?మీ పొట్ట ప్రమాదంలో