Aadhaar: ఇంట్లో కూర్చొని PVC ఆధార్ కార్డ్‌ని పొందండి.. ఈ ప్రక్రియ గురించి తెలుసుకోండి..!

Aadhaar: ఆధార్ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది UIDAI ద్వారా జారీ అవుతుంది. ఇది భారత ప్రభుత్వం కింద పని చేస్తుంది. ఆధార్ కార్డ్‌పై ఉన్న 12-అంకెల నెంబర్ పౌరుల మొత్తం

Aadhaar: ఇంట్లో కూర్చొని PVC ఆధార్ కార్డ్‌ని పొందండి.. ఈ ప్రక్రియ గురించి తెలుసుకోండి..!
Aadhaar
Follow us

|

Updated on: Apr 17, 2022 | 11:39 AM

Aadhaar: ఆధార్ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది UIDAI ద్వారా జారీ అవుతుంది. ఇది భారత ప్రభుత్వం కింద పని చేస్తుంది. ఆధార్ కార్డ్‌పై ఉన్న 12-అంకెల నెంబర్ పౌరుల మొత్తం సమాచారం కలిగి ఉంటుంది. నేటి కాలంలో ఆధార్ అత్యంత ముఖ్యమైన పత్రం. ఇది లేకుండా ఏ పని జరుగదు. ఏ ప్రభుత్వ పథకం నుంచి ప్రయోజనం పొందలేరు. అందుకే దీని భద్రత కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు కొత్తగా UIDAI పౌరులకు PVC ఆధార్ కార్డును తక్కువ రుసుముతో అందిస్తుంది. మీరు కూడా PVC ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

PVC కార్డు తయారీకి 50 రూపాయలు మాత్రమే ఖర్చు

PVC ఆధార్ కార్డుకి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్లో లభించే ప్లాస్టిక్ కార్డ్‌ల కంటే ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని ప్రింట్ కూడా చాలా బాగుంటుంది. ఆధార్ ప్రాముఖ్యత గురించి అందరికి బాగా తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు మీ కోసం మాత్రమే కాకుండా మీ మొత్తం కుటుంబ సభ్యుల కోసం PVC ఆధార్ కార్డ్ అప్లై చేయండి. ఒక్కో కార్డుకి కేవలం రూ. 50 ఖర్చవుతుంది. ఇందులో పన్ను, కొరియర్ ఛార్జీలు ఉంటాయి.

PVC ఆధార్ కార్డ్ కోసం ఇలా అప్లై చేయండి..

1. PVC ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా ఆధార్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. తర్వాత దిగువకు వెళ్లి ఆర్డర్ ఆధార్ PVC కార్డ్‌పై క్లిక్ చేయండి.

3. తర్వాత మీ స్క్రీన్‌పై న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి Send OTPపై క్లిక్ చేయండి.

4. తర్వాత మీ మొబైల్ నంబర్‌కు 6 అంకెల OTP వస్తుంది. ఈ OTP నంబర్‌ను ఎంటర్ చేసి నిబంధనలు, షరతులపై క్లిక్ చేసి ఓకె బటన్‌పై క్లిక్ చేయండి.

5. ఇప్పుడు మీ స్క్రీన్‌పై న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ ఆధార్ వివరాలు, దిగువన చెల్లింపు చేసే ఎంపికను చూస్తారు.

6. ఇప్పుడు మేక్ పేమెంట్‌పై క్లిక్ చేయండి. డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో పాటు నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చెల్లింపు చేసే ఎంపికను పొందుతారు. మీకు నచ్చిన ఎంపికను ఎంచుకుని చెల్లింపు చేయండి.

7. తర్వాత PVC ఆధార్ కార్డ్ కోసం అప్లై చేయడానికి పూర్తి వివరాలను పొందుతారు. తర్వాత మీరు రసీదు స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఎంపికను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి.

8. కొద్ది రోజుల్లోనే PVC ఆధార్ కార్డ్ స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఆఫ్ ఇండియా పోస్ట్ ద్వారా మీ ఇంటికి డెలివరీ అవుతుంది.

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులు అలర్ట్‌.. ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ని యాక్టివేట్ చేసుకోండి..!

IPL 2022: దినేశ్‌ కార్తీక్ దెబ్బకి ఈ 15 కోట్ల ఆటగాడి పని గోవిందా.. జట్టులో చోటు కష్టమే..!

IPL 2022 Orange Cap: KL రాహుల్ రేసులోకి వచ్చేశాడు.. జోస్ బట్లర్‌తో పోటీకి రెడీ..!