OnePlus Nord CE 2 Lite 5G: వన్‌ప్లస్ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్..!
OnePlus Nord CE 2 Lite 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్ ప్లస్ త్వరలో నార్డ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది. దీని పేరు OnePlus Nord CE 2 Lite..
OnePlus Nord CE 2 Lite 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్ ప్లస్ త్వరలో నార్డ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది. దీని పేరు OnePlus Nord CE 2 Lite (OnePlus Nord CE 2 Lite 5G). కంపెనీ ఏప్రిల్ 28న భారత్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. OnePlus ఫోన్ లాంచ్ కోసం ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో OnePlus Nord Buds ప్రారంభించనుంది. OnePlus Nord CE 2 Lite 5G లాంచ్‌కు ముందు కంపెనీ ఫోన్ టీజర్ చిత్రాన్ని షేర్ చేసింది. ఇందులో ఫోన్ మొదటిసారిగా ఆన్‌లైన్‌లో కనిపించింది. డిజైన్, లుక్‌తో పాటు ఫోన్ స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించారు. దీని ప్రకారం, హ్యాండ్‌సెట్‌లో 8GB RAMతో వస్తుంది. అలాగే ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది.
ఈ ఫోన్ టీజర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాబోయే OnePlus స్మార్ట్‌ఫోన్ వెనుక డిజైన్‌ను ఊహించవచ్చు. Realme 9 Pro + 5Gలో వెనుక కెమెరా మాడ్యూల్‌ను పోలి ఉండే ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఫోన్ ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో OnePlus లోగో వెనుక ప్యానెల్ మధ్యలో ఉంచబడుతుంది. అయితే పవర్ బటన్ ఫోన్ కుడి వైపున ఉంటుంది. అయితే ఈ ఫోన్ ధరను మాత్రం వెల్లడించలేదు. కానీ, ఫోన్ పాత మోడల్ బట్టి చూస్తే సుమారు రూ. 20,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక ధర విలువ ఏప్రిల్ 28న వెల్లడికానుంది.
OnePlus Nord CE 2 Lite 5G స్పెసిఫికేషన్‌లు:
OnePlus Nord CE 2 Lite 5G 6.59-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoCతో రావచ్చు, ఇది గరిష్టంగా 8GB RAMతో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లో 256GB వరకు ఇంటర్నల్ మెమోరి ఉండే అవకాశం ఉంది. కెమెరా ఫీచర్ల పరంగా, ఫోటోలు, వీడియోల కోసం స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫ్రంట్ ఫేసింగ్ 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కాకుండా, రాబోయే OnePlus Nord CE 2 Lite 5G 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ఉండనుంది.
Stunning on the outside. Powerful on the inside. Meet the new #OnePlusNordCE2Lite 5G. #MorePowerToYou #MorePowerToYou pic.twitter.com/MNNLFwmgwr
— OnePlus India (@OnePlus_IN) April 16, 2022
ఇవి కూడా చదవండి: