Aadhaar Card: మీ ఆధార్ కార్డుతో ఎవరైన దొంగ లోన్ తీసుకున్నారా.. సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..

మీ ఆధార్ కార్డు ఉపయోగించి మోసగాళ్లు మీ పేరు మీద రుణాలు తీసుకుంటున్నారా.. అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఇంటి నుంచే సింపుల్‌గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు అనుమానాస్పద లోన్స్ కనిపిస్తే వెంటనే ఏం చేయాలి..? అపూ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Aadhaar Card: మీ ఆధార్ కార్డుతో ఎవరైన దొంగ లోన్ తీసుకున్నారా.. సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..
Aadhaar Loan Fraud

Updated on: Nov 04, 2025 | 4:38 PM

ఈ రోజుల్లో ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి ఆస్పత్రి దాకా ఆధార్ కంపల్సరీ. కేవలం ఆధార్, పాన్ కార్డులతో బ్యాంకు లోన్స్ తీసుకోవచ్చు. కానీ మీ ఆధార్‌ను ఉపయోగించి మోసగాళ్లు మీ పేరు మీద నకిలీ రుణాలు తీసుకునే ప్రమాదం ఉందని మీకు తెలుసా..? దీని గురించి తెలియక చాలా మంది అప్పుల ఊబిలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. అయితే మీరు మీ ఇంటి నుండే దీన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

క్రెడిట్ నివేదిక ముఖ్యం

మోసపూరిత రుణాలను తనిఖీ చేయడానికి అత్యంత విశ్వసనీయమైన మార్గం మీ క్రెడిట్ హిస్టరీ. ఇది మీ ఆర్థిక జాతకం లాంటిది. ఈ నివేదిక మీ పేరు మీద ఉన్న అన్ని పెద్ద, చిన్న రుణాలు, అలాగే క్రెడిట్ కార్డుల పూర్తి వివరాలను తెలియజేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా అవసరం.

లోన్స్ చెక్ చేసే విధానం:

  • CIBIL, Experian లేదా Equifax వంటి అధికారిక క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  • మీ పాన్ కార్డ్, ఆధార్ నంబర్, ఇతర సమాచారాన్ని ఎంటర్ చేయండి.
  • మీరు ఏడాదికి ఒకసారి మీ క్రెడిట్ హిస్టరీ రిపోర్ట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ నివేదికను జాగ్రత్తగా పరిశీలించి.. మీకు తెలియని లేదా అనుమానాస్పదమైన లోన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి.

మోసపూరిత లోన్ కనిపిస్తే ఏం చేయాలి..?

మీరు తీసుకోని రుణం మీ నివేదికలో కనిపిస్తే.. వెంటనే తగిన చర్యలు తీసుకోవడం అత్యవసరం.

ఆర్బీఐకి ఫిర్యాదు: ఆర్బీఐ పోర్టల్ అయిన sachet.rbi.org.in లో ఫిర్యాదు చేయండి.

పోలీస్ ఫిర్యాదు: మీ సమీప పోలీస్ స్టేషన్‌లోని సైబర్ క్రైమ్ సెల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే సమస్యను అంత త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది.

ఇవి మర్చిపోవద్దు..

  •  మీ ఆధార్ నంబర్ లేదా ఓటీపీని అపరిచితులతో లేదా ఫోన్ కాల్స్‌లో ఎప్పుడూ పంచుకోకండి.
  • విశ్వసనీయ వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లలో మాత్రమే ఆధార్ ధృవీకరణ చేయండి.
  • మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అలవాటు చేసుకోండి.

కొంచెం జాగ్రత్తతో మీరు పెద్ద మోసాల నుండి మిమ్మల్ని మీరు ఈజీగా రక్షించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి