Aadhaar Card Misuse: ఆధార్ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
ఆధార్ కార్డు పత్రాలను దుర్వినియోగం చేసిన అనేక ఉదంతాలువ్యక్తుల వేలిముద్ర, చిరునామా మొదలైన గుర్తింపు సమాచారాన్ని దొంగిలించి, ఆర్థిక నేరాలకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆధార్ సమాచారాన్ని అనేక రకాలుగా దుర్వినియోగం చేయవచ్చు. ఆధార్ నంబర్‌ని ఉపయోగించి ఒకరి బ్యాంక్ ఖాతా నుండి డబ్బును కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆధార్ దుర్వినియోగమైతే, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు..

Aadhaar Card
ఆధార్ కార్డు పత్రాలను దుర్వినియోగం చేసిన అనేక ఉదంతాలువ్యక్తుల వేలిముద్ర, చిరునామా మొదలైన గుర్తింపు సమాచారాన్ని దొంగిలించి, ఆర్థిక నేరాలకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆధార్ సమాచారాన్ని అనేక రకాలుగా దుర్వినియోగం చేయవచ్చు. ఆధార్ నంబర్‌ని ఉపయోగించి ఒకరి బ్యాంక్ ఖాతా నుండి డబ్బును కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆధార్ దుర్వినియోగమైతే, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు (ఆధార్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా చట్టాలు). పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆధార్ సంబంధిత నేరాలు, శిక్షల జాబితా ఇక్కడ ఉంది.
ఆధార్ దుర్వినియోగం శిక్షార్హమైనది:
- ఆధార్ కోసం నమోదు చేసుకునేటప్పుడు బయోమెట్రిక్స్, పేరు వంటి వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా అందించినట్లయితే గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. లేదా రూ.10,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లేదా జరిమానా, శిక్ష రెండు కూడా పడవచ్చు.
- గుర్తింపు పత్రాలు సేకరిస్తున్న అధికారిక సంస్థగా పేర్కొంటూ సమాచారం పొందితే 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
- ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లేదా ప్రామాణీకరణ సమయంలో సేకరించిన సమాచారాన్ని అనధికార వ్యక్తికి పంపితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు.
- ఆధార్ డేటా నిల్వ చేయబడిన CIDRకి అనధికారిక యాక్సెస్ లేదా హ్యాకింగ్ 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, కనీసం రూ. 10 లక్షల జరిమానా విధించబడుతుంది.
- CIDRలోని డేటాను తప్పుగా చూపితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 10,000 వరకు జరిమానా విధింవచ్చు.
- ఆధార్ కార్డుదారుని గుర్తింపు సమాచారాన్ని కోరే సంస్థ ఆ సమాచారాన్ని అనధికార పద్ధతిలో ఉపయోగిస్తే, వారికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి







