Quantum EV Scooter: మార్కెట్‌లోకి సరికొత్త ఈవీ స్కూటర్.. ఓ సారి చార్జ్ చేస్తే ఏలూరు నుంచి విజయవాడకు వెళ్లి వచ్చేయవచ్చు..
తాజాగా క్వాంటమ్ ఎనర్జీ తన ఈవీ లైనప్‌లో ఓ కొత్త స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. క్వాంటమ్ బిజినెస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ ధర రూ.99,000గా ఉంది.
ప్రస్తుతం భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంపెనీలు కూడా వివిధ మోడల్స్‌లో కొత్త ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా స్కూటర్‌లలో ఎక్కువ మోడల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా క్వాంటమ్ ఎనర్జీ తన ఈవీ లైనప్‌లో ఓ కొత్త స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. క్వాంటమ్ బిజినెస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ ధర రూ.99,000గా ఉంది. ఈ స్కూటర్ డెలివరీ బాయ్స్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎన్ఎఫ్‌బీసీ బ్యాంకులతో టై అయ్యి సరికొత్త ఆఫర్స్‌ను వినియోగదారులకు అందిస్తుంది. అయితే ఈ క్వాంటమ్ బిజినెస్ స్కూటర్ ప్రత్యేకతలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
క్వాంటమ్ బిజినెస్ ఫీచర్లు ఇవే
- 1200 వాట్స్ అధిక పనితీరు మోటర్
- గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగం
- కేవలం 8 సెకండ్లల్లో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం
- ఓ సారి పూర్తిగా చార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల మైలేజ్
- రిమోట్ లాక్-అన్‌లాక్, యాంటీ-థెఫ్ట్ అలారం, యూఎస్‌బీ చార్జర్, డిస్క్ బ్రేక్‌లు ఎల్‌సీడీ డిస్‌ప్లే
- ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్‌కు మూడు సంవత్సరాల బ్యాటరీ వారెంటీ లేదా 90,000 కిలోమీటర్ల వరకూ వారెంటీ వస్తుంది.
- కార్గో ర్యాక్, పెద్ద ఫ్లాట్ ఫుట్ బోర్డ్, 12 అంగుళాల వీల్ బేస్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి