Amul Dairy Shop: వ్యాపారం చేయాలనుకునేవారికి సువర్ణావకాశం.. అమూల్ డైరీతో అదిరిపోయే లాభాలు

|

Jun 15, 2024 | 5:10 PM

భారతదేశంలోని పాల మార్కెట్ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంది. కేవలం పాల ఉత్పత్తులను కేంద్రంగా ఉంచకుండా దాన్ని బేస్ చేసుకుని చేసే ఇతర వ్యాపారాలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి డెయిరీ కంపెనీలకు సంబంధించిన డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఫ్రాంచైజీలను తీసుకోవడం ఉత్తమ వ్యాపార ఆలోచనలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

Amul Dairy Shop: వ్యాపారం చేయాలనుకునేవారికి సువర్ణావకాశం.. అమూల్ డైరీతో అదిరిపోయే లాభాలు
Amul
Follow us on

భారతదేశంలోని పాల మార్కెట్ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంది. కేవలం పాల ఉత్పత్తులను కేంద్రంగా ఉంచకుండా దాన్ని బేస్ చేసుకుని చేసే ఇతర వ్యాపారాలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి డెయిరీ కంపెనీలకు సంబంధించిన డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఫ్రాంచైజీలను తీసుకోవడం ఉత్తమ వ్యాపార ఆలోచనలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. భారతదేశంలో 1946 నుంచి వివిధ రకాల పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న అగ్ర కంపెనీలలో అమూల్ ఒకటిగా ఉంది. అమూల్ దుకాణాన్ని కలిగి ఉండటం చాలా మందికి కలల వ్యాపారం. ఈ కంపెనీల నుంచి ఫ్రాంచైజీని పొందడానికి ప్రక్రియను తెలుసుకోవాలి. ఈ ప్రక్రియను దశలవారీగా అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమూలు ఫ్రాంచైజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

భారతదేశంలో అగ్రశ్రేణి పాల ఉత్పత్తుల కంపెనీలలో ఒకటిగా ఉన్నందున అమూల్ ఫ్రాంచైజీ యజమానికి సంబంధించిన లాభంలో కమీషన్ తీసుకోదు. ఈ విధానం కారణంగా భారతదేశంలోని వివిధ మూలల్లో ఫ్రాంచైజీ కోసం భారీ సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అమూల్ తమ ఉత్పత్తులను కమీషన్‌పై అందుబాటులో ఉంచుతుంది. ఈ సౌకర్యాలు ఫ్రాంఛైజ్ యజమాని తమ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మరింత లాభం పొందడంలో సహాయపడతాయి. భారతదేశంలో అమూల్ అందించే రెండు రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి. కంపెనీ నుంచి ఫ్రాంచైజీని కలిగి ఉండాలంటే వారికి సొంత దుకాణం లేదా వ్యాపారం కోసం తగినంత భూమి ఉండాలి. అమూల్ రెండు రకాల ఫ్రాంచైజీలలో అమూల్ అవుట్‌లెట్‌లు, పార్లర్‌లు లేదా కియోస్క్‌లు, ఐస్ క్రీం స్కూపింగ్ పార్లర్‌లు ఉన్నాయి. అమూల్ అవుట్‌లెట్, పార్లర్ లేదా కియోస్క్ కలిగి ఉండాలంటే కనీసం 150 చదరపు అడుగుల స్థలం ఉన్న దుకాణాన్ని కలిగి ఉండాలి. ఐస్‌క్రీం స్కూపింగ్ పార్లర్‌ను కలిగి ఉండాలంటే కనీసం 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

అమూల్ నుంచి ఫ్రాంచైజీని పొందడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. అవసరమైన అన్ని వివరాలు వెబ్‌సైట్‌లో పేర్కొంటారు. ఔట్‌లెట్‌కు సంబంధించిన వారి వివరాలను వారి అధికారిక ఈ-మెయిల్‌కుపంపాలి. అమూల్ అవుట్‌లెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు రూ. 25,000 డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్ తిరిగి చెల్లించరు. ఈ ఛార్జీ కాకుండా కంపెనీ నిబంధనల ప్రకారం అవుట్‌లెట్ ఫ్రాంచైజీకి తగినట్లుగా చేయడానికి రూ.1 లక్ష ఖర్చు చేయాలి. ఫ్రీజర్‌లు, పరికరాలపై మరో రూ. 75,000 పెట్టుబడి పెట్టాలి. ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీని తీసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు షాప్ ఫ్రాంచైజీని సిద్ధం చేయడానికి రూ. 4 లక్షలతో పాటు రూ. 50,000 సెక్యూరిటీ డబ్బుగా ఖర్చు చేయాలి. ఫ్రాంచైజీకి అవసరమైన పరికరాల కోసం మరో రూ.1.50 లక్షలు కూడా అవసరమవుతాయి. కంపెనీ పాల ఉత్పత్తులపై 10 శాతం కమీషన్, ఐస్ క్రీంపై 20 శాతం కమీషన్, హాట్ చాక్లెట్ డ్రింక్స్, షేక్స్, రెసిపీ ఐస్ క్రీమ్‌లపై 50 శాతం కమీషన్‌ను అందిస్తుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు పాలసీలను వివరంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను చూడడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి