Vehicle Insurance: వాహన బీమా పాలసీలో ఎవరికీ తెలియని ఫీచర్‌.. వాహనం వాడినరోజులకే బీమా ప్రీమియం..

ఏదైనా ప్రమాదం వల్ల మనకు జీవితంలో కోలుకోలేని నష్టం జరిగినా బీమా సొమ్ము చేతికి అందుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. కాబట్టి వాహన బీమా తప్పనిసరిగ్గా చేయించుకోవాల్సి ఉంటుంది. వాహన బీమాలో రెండు రకాలు ఉంటాయి. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌తో పాటు ఫుల్లీ కవర్డ్‌ ఇన్సూరెన్స్‌ ఉంటాయి. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఖర్చు తలకు మించిన భారంగా ఉందని పలువురు వాహనదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మోటర్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో ఎవరికీ తెలియని ఓ ఫీచర్‌ ఉంది.

Vehicle Insurance: వాహన బీమా పాలసీలో ఎవరికీ తెలియని ఫీచర్‌.. వాహనం వాడినరోజులకే బీమా ప్రీమియం..
insurance

Edited By: Ram Naramaneni

Updated on: Sep 28, 2023 | 10:16 PM

ప్రస్తుత రోజుల్లో బీమా అనేది తప్పనిసరి అవసరంగా మారింది. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మనం భౌతికంగా దూరమైనప్పుడు కుటుంబానికి బీమా పాలసీల వల్ల ఆర్థిక భరోసా ఉంటుంది. అలాగే ఏదైనా ప్రమాదం వల్ల మనకు జీవితంలో కోలుకోలేని నష్టం జరిగినా బీమా సొమ్ము చేతికి అందుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. కాబట్టి వాహన బీమా తప్పనిసరిగ్గా చేయించుకోవాల్సి ఉంటుంది. వాహన బీమాలో రెండు రకాలు ఉంటాయి. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌తో పాటు ఫుల్లీ కవర్డ్‌ ఇన్సూరెన్స్‌ ఉంటాయి. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఖర్చు తలకు మించిన భారంగా ఉందని పలువురు వాహనదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మోటర్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో ఎవరికీ తెలియని ఓ ఫీచర్‌ ఉంది. మనం మన వాహనాన్ని రోడ్డుపై ఎన్నిరోజులు వాడితే అన్ని రోజులకే ప్రీమియం చెల్లించవచ్చు. ఆ వివరాలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం.

వాహనదారులు వాహన వినియోగాన్ని బట్టి మీరు మీ కారు బీమా పాలసీని స్విచ్ ఆన్ చేయవచ్చు. కావాలంటే స్విచ్ ఆఫ్ కూడా చేయవచ్చు. అలాగే ప్రీమియం చెల్లించి కొన్ని అదనపు లాభాలు కూడా పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన మోటారు భీమా పథకాలు వినియోగదారులు వాహనాన్ని ఉపయోగించే రోజుల్లో మాత్రమే ప్రీమియం చెల్లించడానికి అనుమతిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే వాహన యజమానులు ఒక బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగం ఆధారంగా వారి కారు బీమా కవరేజీని ఆన్, ఆఫ్ చేయవచ్చు.

యాడ్‌ ఆన్‌ ఫీచర్‌ ఉపయోగాలు

ఈ యాడ్-ఆన్ ఫీచర్ అంటే మీటర్ లేదా స్విచ్ ఆన్/ఆఫ్ ఫీచర్ వాహన వినియోగంపై ఆధారపడి ఉంటుంది. వాహనం ఉపయోగంలో ఉన్నప్పుడు బీమా చేసిన వ్యక్తి కవరేజీకి మాత్రమే చెల్లించడానికి బీమా సంస్థలు అనుమతిస్తాయి. వాహనం యజమాని మోటారు కవరేజీని ఉపయోగించనప్పుడు ఆఫ్ మోడ్‌లో ఉంచవచ్చు. ఈ యాడ్-ఆన్ ఫీచర్ తక్కువ డ్రైవ్ చేసే లేదా సురక్షితంగా డ్రైవ్ చేసే వాహన యజమానుల బడ్జెట్‌లకు అనుకూలంగా ఉంటుంది.  ఈ ఫీచర్ కింద కవరేజ్ నిరంతరాయంగా 24 గంటల వ్యవధిలో ఆఫ్ మోడ్‌లో ఉంటే కస్టమర్‌లకు రివార్డ్ డే ఇస్తారు. అంటే ప్రతి ఇన్‌యాక్టివ్ డేకి ఒక్కో రివార్డ్ డే వస్తుంది. ఈ ఫీచర్‌ వాహన వయస్సు, తయారీ, మోడల్‌కు అనుగుణంగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

రివార్డ్ రోజుల ఉపయోగాలివే

రివార్డ్ రోజుల తర్వాత డిస్కౌంట్లు/క్యాష్‌బ్యాక్/కొన్ని శాతం ఓన్ డ్యామేజ్ (ఓడీ) ప్రీమియం ద్వారా పాలసీ వ్యవధి ముగింపులో రీడీమ్ చేసుకోవచ్చు. మోటర్‌ ఇన్సూరెన్స్‌తో పాటు ఈ వినూత్న ఫీచర్‌ను కలిగి ఉండటం వల్ల కస్టమర్‌లు డ్రైవింగ్ చేయనప్పుడు ప్రీమియంలను ఆదా చేయడంతో పాటు సురక్షితమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తుంది.

అందించే కంపెనీలివే

కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇటీవల ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో తన యాడ్-ఆన్ మీటర్ కవర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం యాడ్-ఆన్ ద్వారా క్యాష్‌బ్యాక్ అందించే భారతదేశపు మొదటి కంపెనీగా అవతరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈజీఐ కూడా తన ప్రైవేట్ కార్ ప్యాకేజీ పాలసీ కోసం స్విచ్ పే యాజ్ యు డ్రైవ్ (పేడీ) యాడ్-ఆన్‌ను కూడా ప్రారంభించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి