కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో పాత పెన్షన్ ప్రయోజనాలు..!

|

Mar 02, 2022 | 9:45 PM

Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు త్వరలో పాత పెన్షన్ స్కీమ్ (OPS) ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి.

కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో పాత పెన్షన్ ప్రయోజనాలు..!
Money
Follow us on

Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు త్వరలో పాత పెన్షన్ స్కీమ్ (OPS) ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ డిమాండ్‌ను ఉద్యోగులు చాలా కాలంగా ప్రభుత్వం ముందు ఉంచారు. దీనిని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకోసం న్యాయ మంత్రిత్వ శాఖ అభిప్రాయాన్ని కూడా కోరింది. ఇప్పుడు మంత్రివర్గం నుంచి సమాధానం కోసం వేచి ఉంది. వాస్తవానికి డిసెంబర్ 31, 2003కి ముందు రిక్రూట్‌మెంట్ అయిన ఉద్యోగులు ఓల్డ్‌ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు. మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెచ్చింది.

జనవరి 1, 2004న లేదా అంతకు ముందు రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటన జారీ చేసిన ఉద్యోగులను NPS నుంచి మినహాయించడం గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారు ఓల్డ్‌ పెన్షన్ ప్రయోజనానాకి అర్హులు’ అవుతారని చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ ఆ ఉద్యోగులను ఎన్‌పిఎస్ నుంచి మినహాయించాలని ఆర్థిక సేవల శాఖ (డిఎఫ్‌ఎస్), న్యాయ మంత్రిత్వ శాఖను కోరినట్లు మంత్రి వివరించారు. ఎందుకంటే వీరి నియామక ప్రకటనలు 31 డిసెంబర్ 2003న లేదా అంతకు ముందు జారీ చేయబడినవని పేర్కొన్నారు. ఈ కాలంలో రిక్రూట్‌ అయిన ఉద్యోగులకు మాత్రమే ఓల్డ్‌ పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయా లేదంటే మొత్తం ఉద్యోగులకి వర్తిస్తాయా అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Reliance: ఫ్యూచర్ స్టోర్స్‌ని రీబ్రాండింగ్ చేస్తున్న రిలయన్స్.. 30 వేల మందికి ఉద్యోగాలు

NTPC Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త.. పది, డిప్లొమా అర్హతతో NTPCలో ఉద్యోగాలు..

IPL 2022: CSK జట్టుకు భారీ షాక్.. 14 కోట్ల స్టార్ ప్లేయర్ ఔట్..?