
చాలా మంది ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తుంటారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా నిబంధనలను తుంగలో తొక్కుతుంటారు. ప్రతి రోజు వేలాది ట్రాఫిక్ చలాన్లను జారీ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. ప్రతి నెల మొత్తం ట్రాఫిక్ చలాన్లు కుప్పలు తెప్పలుగా నమోదు అవుతుంటారు. ఈ నేపథ్యంలో చలాన్లను వసూలు చేసేందుకు వాహనదారులకు డిస్కౌంట్లను అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను పరిష్కరించడానికి ఓ పథకాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కింద వాహన యజమానులు తమ పాత ట్రాఫిక్ చలాన్‌లను వన్-టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. రాష్ట్రంలో రూ. 2,500 కోట్లకు పైగా ఉన్న ట్రాఫిక్ జరిమానాలను తగ్గించడంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ముంబైలోనే రూ. 1,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తులంపై భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..
HT నివేదికల ప్రకారం.. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇది రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని అందిస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ముంబైలో దాదాపు రూ.1,817 కోట్ల విలువైన ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో రూ.817 కోట్లు మాత్రమే తిరిగి పొందగలిగారు. ఇంకా రూ.1,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉంది. దీని కోసం ప్రభుత్వం కొత్త పద్ధతులను అనుసరించాలని కోరుకుంటోంది. అయితే ఈ పథకం ఎప్పుడు అమలు చేయబడుతుందో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాబోయే నెలల్లో ఆమోదం పొందిన తర్వాత దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: అయ్యో పాపం.. చిన్నారిపై వీధి కుక్కల కృరత్వం.. ఈ వీడియో చూస్తేనే గుండె తరుక్కుపోతుంది!
ద్విచక్ర, త్రిచక్ర వాహన యజమానులకు 75% తగ్గింపు:
ఈ పథకం కింద చిన్న వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల యజమానులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. వారు చెల్లించాల్సిన చలాన్‌లో 25% మాత్రమే చెల్లించాలి. మిగిలిన 75% జరిమానాను మాఫీ చేయవచ్చు. దీనితో పాటు ఒక వ్యక్తి చలాన్ అందుకున్న 15 రోజుల్లోపు చెల్లిస్తే అతనికి తగ్గింపు పొందవచ్చు. ఇది ప్రజలు సకాలంలో చలాన్ చెల్లించే అలవాటును పొందడానికి సహాయపడుతుంది.
లగ్జరీ కార్లపై తక్కువ డిస్కౌంట్:
ఖరీదైన, విలాసవంతమైన వాహనాల యజమానులకు అలాంటి ఉపశమనం లభించదు. నివేదిక ప్రకారం.. వాహనం మోడల్, దాని ధర ఆధారంగా ప్రభుత్వం వివిధ వర్గాల డిస్కౌంట్లను నిర్ణయించవచ్చు. ఇది న్యాయమైన రికవరీకి దారితీస్తుంది. ఎక్కువ ఆదాయాన్ని పొందుతుంది. గతంలో ప్రభుత్వం లోక్ అదాలత్‌ల ద్వారా బకాయిలను వసూలు చేయడానికి ప్రయత్నించింది. దీనిలో 50% వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో ప్రజల భాగస్వామ్యం తక్కువగా ఉంది. కొత్త వన్-టైమ్ సెటిల్‌మెంట్ పథకం ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. సాధారణ పౌరులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: రైళ్లలో కూడా విమానాల మాదిరిగానే నిబంధనలు.. ఈ తప్పు చేస్తే భారీ జరిమానా తప్పదు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి