సంస్థాగత పెట్టుబడుల రంగంలో 67% పెరిగిన నియామకాలు.. వీరికి ఫుల్‌ డిమాండ్!

గత దశాబ్ద కాలంలో భారత్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 1.2 ట్రిలియన్ డాలర్ల నుంచి 5.2 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు తాజా సర్వే తెల్పింది. అంతేకాకుండా ఈ రంగం వర్క్‌ఫోర్స్‌లో కూడా గణనీయమైన పురోగతి సాధించిందని సోమవారం విడుదలైన CIEL HR సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. గత రెండేళ్లలో ఈ రంగంలో నియామకాలు దాదాపు 67 శాతం పెరిగినట్లు పేర్కొంది..

సంస్థాగత పెట్టుబడుల రంగంలో 67% పెరిగిన నియామకాలు.. వీరికి ఫుల్‌ డిమాండ్!
Jobs In Indias Institutional Investor Sector

Updated on: Feb 26, 2025 | 1:06 PM

గడచిన రెండేళ్లలో భారత్‌లో సంస్థాగత పెట్టుబడిదారుల రంగం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య 69 శాతం గణనీయంగా పెరిగినట్లు CIEL HR సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ‘ఇన్‌స్టిట్యూషనల్ ఇన్‌వెస్టర్స్ – టాలెంట్ ట్రెండ్స్ అండ్ ఇన్‌సైట్స్’ పేరిట వెలువడిన ఈ నివేదిక పలు కీలక అంశాలను వెల్లడించింది.  ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో భారత్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 1.2 ట్రిలియన్ డాలర్ల నుంచి 5.2 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు తెల్పింది. అంతేకాకుండా ఈ రంగం వర్క్‌ఫోర్స్‌లో కూడా గణనీయమైన పురోగతి సాధించింది. మొత్తం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం 27 శాతంగా ఉంది. అయితే లీడర్‌షిప్‌ రోల్స్‌లో మాత్రం మహిళలు పెను సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ రంగంలో కేవలం 14 శాతం మహిళలు మాత్రమే సీనియర్లుగా పదోన్నతులు అందుకుంటున్నారు.

ట్యాలెంట్‌ మొబిలిటీకి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫండ్ మేనేజర్లు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, సీనియర్ విశ్లేషకులు సహా ఈ రంగంలో కేవలం 17 శాతం మంది ప్రొఫెషనల్స్ మాత్రమే పదోన్నతులు పొందుతున్నారు. మిగిలిన 83 శాతం మందిని నియామకాల ద్వారా ఎంపిక చేసుకున్నారు. ఇది ఈ రంగంలోని కంపెనీలకు అంతర్గత కెరీర్ పురోగతి, ప్రతిభ వృద్ధి చెందడానికి, పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి అవకాశాన్ని కల్పిస్తుందనడానికి నిదర్శనం. 2030 నాటికి 7 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్‌ సంస్థాగత పెట్టుబడిదారుల రంగం అడుగులు వేస్తుంది. అంటే రాబోయే ఐదేళ్లలో ఈ రంగం 6.1 శాతం వృద్ధి రేటు పొంది 2027 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించే అవకాశం ఉంది. భారత్‌ సంస్థాగత పెట్టుబడిదారుల రంగం ఈ పరిణామంలో ముందంజలో ఉందని CIEL HR ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్ కె పాండియరాజన్ తెలిపారు.

ఈ రంగంలోని 80 కంపెనీలలో 16 వేల మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌లు పనిచేస్తున్నారు. లింగ వైవిధ్యం, సంస్థలలో పదవీకాలం, డిమాండ్‌, కెరీర్ పురోగతి వంటి కీలక అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఈ రోల్స్ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్-సరఫరా అంతరాన్ని మరింత పెంచుతుంది. నైపుణ్యం కలిగిన నిపుణులు ప్రపంచ మార్కెట్ల నుంచి భారత్‌కు తిరిగి వస్తారని, విదేశీ నిపుణులను కూడా దేశం ఆకర్షించే అవకాశం ఉందని CIEL HR మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య నారాయణ్ మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థాగత పెట్టుబడిదారుల రంగంలోని గత ఏడాదిలో దాదాపు 25 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను మార్చుకున్నారు. ఎందుకంటే.. ఈ రంగంలో సగటు పదవీకాలం మూడేళ్లు. ఇది అధిక చలనశీలత, ప్రతిభకు పోటీని ప్రతిబింబిస్తుంది. అయితే ఈ రంగంలోని ప్రతిభ కలిగిన నిపుణులు ఉన్నత స్థాయిల్లో పదోన్నతులు పొందుతున్నారు. వీరిలో ఎంబీఏ, సీఏ, పీఎఫ్‌ఏ కోర్సులు చేసిన వారే అధిక మంది ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.