ఇల్లు కొనడం ప్రతి ఒక్కరి కల. కొత్త ఇల్లు, ప్లాట్లు కొనాలంటే లక్షల్లో డబ్బు కావాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఒక్కసారిగా ఇల్లు కొనడం కొందరికి కష్టం. అలాంటి వారు హౌస్ లోన్ తీసుకోవడం ద్వారా వారి కలలను సాకారం చేసుకుంటారు. హౌస్ లోన్ తీసుకునే వారు ఖచ్చితంగా వీటిని గురించి ఆలోచించాల్సిందే అంటున్నారు ఆర్థిక నిపుణులు. నిర్ణీత వ్యవధిలో గా రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటేనే గృహ రుణం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. లోన్ తీసుకునే ముందు ఖచ్చితంగా నెల నెల EMI చెల్లించేలా మీ ఆర్థిక పరిస్థితి ఉందో లేదో అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెలా EMI చెల్లిస్తేనే మి సిబిల్ స్కోర్ మెయిన్ టెన్ అవుతుంది. అంతే కాదు మీ నెల వారి వసతి ఖర్చులను ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
గృహ రుణంపై వడ్డీ రేటు ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో 8.40 శాతం నుంచి 11.60 శాతం వరకు ఉంటుంది. వడ్డీ రేటు క్రెడిట్ స్కోర్, పదవీకాలం మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లలో రుణాలు లభిస్తాయి. తక్కువ వ్యవధిలో రుణం చెల్లించినా బ్యాంకులు తక్కువ వడ్డీకే ఇస్తాయి. అయితే ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
సాధారణంగా EMI లోన్ మొత్తం, లోన్ కాలపరిమితి మరియు వడ్డీ రేటు అనే మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మరో రెండు కోణాలు కూడా ఉన్నాయి. ఇది ప్రధాన భాగం.. EMIలో ఒక భాగాన్ని వడ్డీ అని మరియు మరొక భాగాన్ని అసలు అని పిలుస్తారు.
ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇప్పుడు కెనరా బ్యాంక్ నుండి 9 శాతం వడ్డీకి 20 సంవత్సరాలకు రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారనుకుందాం. అలా అయితే అతను ప్రతి నెల ఎంత EMI చెల్లించాలి?
EMIని లెక్కించడానికి నిర్దిష్ట సూత్రాలు ఉన్నాయి. అంటే EMI = {P x R x (1+R)^N} / {(1 + R)^N – 1}. ఇక్కడ, P అనేది అసలు మొత్తం, R అనేది నెలవారీ వడ్డీ రేటు (వార్షిక వడ్డీ రేటు 12తో భాగించబడుతుంది) మరియు N అనేది EMI చెల్లింపుల సంఖ్య. EMI ఎన్ని వాయిదాలలో చెల్లించబడుతుందో అర్థం.
దీని ప్రకారం, 20 సంవత్సరాల పాటు 50 లక్షల గృహ రుణంపై నెలవారీ రూ.63,337 EMI చెల్లించబడుతుంది. మొత్తం రూ.26,00,546 వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నారు. వడ్డీతో కలిపి మొత్తం 76,00,546 రూపాయలు చెల్లించాలి. ఆన్‌లైన్ హోమ్ లోన్ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి EMIని లెక్కించవచ్చు.