
మీరు బ్యాంకులో FD చేయాలని ఆలోచిస్తున్నారా? అలా అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం 444 రోజుల బ్యాంక్ FD బాగా ట్రెండ్ అవుతోంది. ఈ ఆఫర్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుంది. మనం దేశంలోని వివిధ బ్యాంకుల 444 రోజుల ప్రత్యేక FDలపై వడ్డీ రేట్ల అందిస్తున్నాయి. ఏ బ్యాంకు తన 444 రోజుల FDలపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
డబ్బు పెట్టుబడి విషయానికి వస్తే చాలా మంది తమ డబ్బును బ్యాంక్ FDలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. దీనికి కారణం FDలలో డబ్బు స్థిర రాబడి, భద్రత. దేశంలోని వివిధ బ్యాంకులు వేర్వేరు కాలపరిమితి గల వారి FDలపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తాయి.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన SBI, తన కస్టమర్లకు అమృత్ వృష్టి FD అనే 444 రోజుల ప్రత్యేక FDని అందిస్తుంది. ఈ FDలో సాధారణ పౌరులు 6.60 శాతం వడ్డీ రేటుతో రాబడిని పొందుతారు.
కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు 444 రోజుల FDని అందిస్తుంది. ఈ FDలో సాధారణ పౌరులు 6.50 శాతం వడ్డీని పొందుతారు.
ప్రఖ్యాత ప్రభుత్వ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తన కస్టమర్లకు 444 రోజుల కాలపరిమితి కలిగిన FDని అందిస్తుంది. ఈ FDలో సాధారణ పౌరులు 6.60 శాతం వడ్డీ రేటుతో రాబడిని పొందుతారు.
ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్లకు 444 రోజుల FDని కూడా అందిస్తుంది. ఈ FDలో సాధారణ పౌరులు 6.70 శాతం వడ్డీని పొందుతారు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన కస్టమర్లకు 444 రోజుల కాలపరిమితి కలిగిన FDలను కూడా అందిస్తుంది. ఈ FDలో సాధారణ పౌరులు 6.70 శాతం వడ్డీ రేటుతో రాబడిని పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి