Success Story: ఇంటర్‌ ఫెయిల్‌.. 7 రోజుల్లో రూ.336 కోట్లు సంపాదించిన వ్యాపారి సక్సెస్‌ స్టోరీ

|

Dec 30, 2024 | 4:36 PM

Success Story: తమ కఠోర శ్రమ, అంకితభావంతో ఎందరో విజయాల కొత్త చరిత్రను లిఖించారు. ఇంటర్మీడియేట్‌లో ఫెయిల్‌ అయినా విజయాలను సాధించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వ్యక్తులు నేడు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. చదువులో పెద్దగా రాణించలేకపోయినా కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు..

Success Story: ఇంటర్‌ ఫెయిల్‌.. 7 రోజుల్లో రూ.336 కోట్లు సంపాదించిన వ్యాపారి సక్సెస్‌ స్టోరీ
Follow us on

విజయానికి కృషి, సహనం అవసరం. ఈ రెండూ కలిస్తేనే మీరు విజయ శిఖరాలను చేరుకుంటారు. మన దేశంలో ఇప్పటి వరకు చాలా మంది కష్టపడి, సహనంతో, తెలివితేటలతో విజయాలు సాధించారు. అందుకే వారికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అలాంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. 12వ తరగతిలో ఫెయిలైనా కోట్లాది వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ వ్యాపారి పేరు గిరీష్ మాతృభూతం . గిరీష్ మాతృభూతం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించకపోయినా నేడు కోట్లాది రూపాయలకు యజమాని. గిరీష్ తన 12వ తరగతిలో ఫెయిల్‌ అతని కుటుంబం, స్నేహితులు అతన్ని హేళను చేశారట. అందరు కూడా ఒక విధంగా చూసేవారట. నువ్వు ఫెయిల్‌ అయ్యావు కాబట్టి ఇప్పుడు రిక్షా నడుపుకోవాల్సి ఉంటుంది.. నువ్వు ఇంకేమీ చేయలేవు’ అని ఎంతో మంది అవమానించారట. కానీ గిరీష్ పట్టు వదలలేదు. తనను తాను నమ్ముకుని ముందుకు సాగాడు.

ఎడతెగని ప్రయత్నాల తర్వాత గిరీష్‌కి హెచ్‌సిఎల్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీని తరువాత అతను సాఫ్ట్‌వేర్ కంపెనీ జోహోలో లీడ్ ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. ఐటీ సెక్టార్‌లో పనిచేయడం వల్ల ఈ రంగంలో ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాడు. ఈ అనుభవంతో 2010లో గిరీష్ తన సొంత కంపెనీని ప్రారంభించారు. దానిపేరే ‘ఫ్రెష్‌వర్క్స్‌’. ఫ్రెష్‌వర్క్స్ అనేది IT సొల్యూషన్స్ అందించే సంస్థ. కంపెనీ ప్రస్తుత విలువ రూ.53000 కోట్లు. 2010 నుంచి 2018 వరకు ఎనిమిదేళ్ల కాలంలో గిరీష్ కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది. 2018 నాటికి కంపెనీకి 125 దేశాలలో 100,000 కంటే ఎక్కువ మంది కస్టమర్‌లు ఉన్నారు. ప్రస్తుతం ఫ్రెష్‌వర్క్స్‌లో గిరీష్‌కు 5.229 శాతం వాటా ఉంది. ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ.2,369 కోట్లు.

7 రోజుల్లో రూ. 340 కోట్లు సంపాదన:

ఇవి కూడా చదవండి

గిరీష్ గత వారంలో ఫ్రెష్‌వర్క్స్ షేర్లను విక్రయించారు. అతను 7 రోజుల్లో మొత్తం $39.6 మిలియన్ షేర్లను విక్రయించాడు. దీని ప్రకారం, అతను ఒక వారంలో రూ.336 కోట్లకు పైగా సంపాదించాడు. దీనితో పాటు, SaaS పరిశ్రమలో ప్రముఖ పేరుగా మారిన ఫ్రెష్‌వర్క్స్‌తో గిరీష్ SaaS (సాఫ్ట్‌వేర్‌గా సర్వీస్‌) వ్యాపారంలోకి ప్రవేశించారు.

SaaS వ్యాపారం అంటే ఏమిటి?

SaaS (Software as a Service) కంపెనీలు తమ వినియోగదారులకు ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అందిస్తాయి. సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి ఇన్‌స్టాల్ చేయడానికి బదులుగా, కస్టమర్‌లు సొల్యూషన్‌ని ఉపయోగించడానికి సబ్‌స్క్రయిబ్ చేస్తారు. ఇది అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. ఇది వారి వ్యాపారాన్ని పెంచుకోవడం సులభం చేస్తుంది.

ఇది కూడా చదవండి: Richest Youtubers: వీరు భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌లు.. వీరి సబ్‌స్క్రైబర్లు, సంపద ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి