రిలయన్స్(Reliance) రిటైల్ కొత్త రిటైల్ స్టోర్ బ్రాండ్ స్మార్ట్ బజార్(brand smart bazaar)ను ప్రారంభించబోతోంది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్(Big Bazaar) అవుట్‌లెట్ల పేరును బ్రాండ్ స్మార్ట్ బజార్‌గా మార్చాలని నిర్ణయించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం దాదాపు 950 ప్రాపర్టీలలో తన సొంత స్టోర్లను తెరవడానికి పని చేస్తోందని ఇద్దరు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. నివేదిక ప్రకారం, కొన్ని స్మార్ట్ బజార్ స్టోర్‌లతో సహా పలు ప్రదేశాల్లో కనీసం 100 స్టోర్‌లను తెరవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ నెలలో వీటిని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ నివేదికపై రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ ఇంకా స్పందించలేదు.
రిలయన్స్ రిటైల్ ప్రస్తుత స్మార్ట్ సూపర్ మార్కెట్‌ల కంటే స్మార్ట్ బజార్ రోజువారీ దుస్తులు, సాధారణ వస్తువులపై ఎక్కువ దృష్టి పెడుతుందని అధికారులు తెలిపారు. ఇవి బిగ్ బజార్ తరహాలో రూపొందించనున్నారు. సెంట్రల్ వంటి పెద్ద ఫ్యూచర్ గ్రూప్ స్టోర్‌లు ఉన్నాయి. ఇవి 60,000 చదరపు అడుగుల నుంచి 100,000 చదరపు అడుగుల వరకు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ రిలయన్స్ రిలయన్స్ మాల్ వంటి దాని ప్రస్తుత బ్రాండ్లను తీసుకువస్తుంది. అదనంగా ఫ్యూచర్ గ్రూప్ ఫ్రాంచైజీగా సెంట్రల్ ఫార్మాట్‌ను నిర్వహించాలని ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్‌కు ప్రతిపాదించింది.
Read also.. Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 86, నిఫ్టీ 35 పాయింట్లు అప్..