Budget 2022: ప్రభుత్వం చూపు వాటివైపే.. బడ్జెట్‌లో ఆ రంగాలకే అధిక కేటాయింపులు..!

|

Feb 01, 2022 | 7:40 AM

Nirmala Sitharaman's Budget: నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ( Budget 2022) ను ప్రవేశపెట్టనున్నారు.

Budget 2022: ప్రభుత్వం చూపు వాటివైపే.. బడ్జెట్‌లో ఆ రంగాలకే అధిక కేటాయింపులు..!
Budget 2022
Follow us on

Nirmala Sitharaman’s Budget: నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ( Budget 2022) ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ తరుణంలో సామాన్యులపై భారం పడకుండా ఆర్థిక లోటును పూడ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీంతో పలు రంగాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. ఎందుకంటే వృద్ధిని పెంచడానికి కిక్‌స్టార్టింగ్ పెట్టుబడిని లక్ష్యంగా చేసుకుని బడ్జెట్‌లో భారత ప్రభుత్వం ఖర్చును పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో రోడ్లు, ఓడరేవులతో సహా నిర్మాణ వ్యయం, అలాగే ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధనం కోసం ప్రోత్సాహకాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఎందుకంటే విధాన రూపకర్తలు ఆర్థిక వ్యవస్థను లోటు నుండి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. మహమ్మారి తర్వాత ఫెడరల్ రిజర్వ్ వృద్ధి రేటు పెరుగుదల నిలిచిపోయింది. విదేశీ ఫండ్స్ కూడా మార్కెట్ నుంచి డ్రాపవుట్ అవుతున్నాయి. ఇలాంటి ఆందోళనలతో గ్లోబల్ అమ్మకాల్లో భారతదేశ ఈక్విటీ షేర్ బెంచ్‌మార్క్ పడిపోయింది. ఈ క్రమంలో బడ్జెట్ ప్రకటనలు కొంత ఉపశమనం కలిగించే అవకాశముందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ఎనిమిదేళ్లలో కేవలం మూడేళ్ళలో బడ్జెట్ రోజు తర్వాత నెలలో బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ పెరిగింది. మిగిలిన ఐదు సందర్భాలలో పడిపోయింది. ఈ తరుణంలో బడ్జెట్ మొత్తం దృష్టి ఉద్యోగాల కల్పన, పెట్టుబడి ఆధారిత వృద్ధిపైనే ఉంటుంది. అంతేకాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రోత్సాహకరం లభిస్తుంది.. అని యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో క్వాంటిటేటివ్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నీరజ్ చదవార్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రోడ్లు, నీరు, మెట్రో, రైల్వేలు, రక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, గ్రీన్ టెక్నాలజీలపై దృష్టిసారిస్తుందని.. వీటిపై ప్రజల చూపు కూడా ఉందని పేర్కొన్నారు. దీంతోపాటు కొన్ని ప్రముఖ కంపెనీలు, స్టాక్ మార్కెట్ రంగం పలు అంచనాలు వేస్తున్నాయి. మౌలిక సదుపాయాలు రోడ్లు, వాయు, నౌకాశ్రయాలు, షిప్పింగ్, రైల్వేలు ఇతర సేవలపై భారతదేశపు టాప్-30 కంపెనీల అంచనా వేశాయి. బడ్జెట్‌లో ఈ రంగాలకు నిధుల కేటాయింపు 2021లో 36% పెరిగింది. 2009 నుంచి ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం కొనసాగించడంతోపాటు వృద్ధిని చేరుకుంది.

ICICI కూడా.. రోడ్లు, రక్షణ, నీరు, హౌసింగ్, రైల్వేలపై అధిక వ్యయంతో కేటాయింపు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఉద్గారాలను తగ్గించడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆహార ప్రాసెసింగ్‌కు సహాయం, ఉత్పత్తికి సంబంధించిన ప్రోత్సాహకాలు, అధిక వ్యవసాయ రుణాలు, ఎరువులు పంటల రక్షణ కోసం సబ్సిడీలు, వ్యవసాయం – గ్రామీణ ప్రాంతాలకు చేయూత పెరిగే అవకాశముంది. హెల్త్ కేర్/ఫార్మా హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉత్పత్తిని పెంచడానికి కంపెనీలపై వ్యయాన్ని పెంచుతుందని, అలాగే ఆరోగ్య బీమాను కొనుగోలు చేసే వ్యక్తులకు పన్ను మినహాయింపు, ఔషధ పరిశోధన, వైద్య సంరక్షణకు మెరుగైన నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.

Also Read:

Budget 2022 Live Stream: నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగాన్ని ఎప్పుడు.. ఎక్కడ చూడాలి

Budget 2022: బడ్జెట్ వైపు స్టాక్ మార్కెట్ చూపు.. పెట్టుబడిదారులు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే..