బడ్జెట్ అత్యద్భుతం, అన్ని రంగాలకు ప్రాధాన్యం, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువిస్తే తప్పేం లేదు : అమరావతి ఎంపీ నవనీత్ కౌర్

|

Feb 02, 2021 | 12:13 AM

కోవిడ్-19 పరిస్థితులను అధిగమించిన భారతదేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ..

బడ్జెట్ అత్యద్భుతం, అన్ని రంగాలకు ప్రాధాన్యం, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువిస్తే తప్పేం లేదు : అమరావతి ఎంపీ నవనీత్ కౌర్
Follow us on

కోవిడ్-19 పరిస్థితులను అధిగమించిన భారతదేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. సినీ నటిగా తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన ఆమె, కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ వ్యవసాయం, పారిశ్రామిక రంగం, మౌలిక వసతులు, దేశ రక్షణ, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత లభించిందని వ్యాఖ్యానించారు. గ్యాస్ పైప్ లైన్లను పెంచాలన్న ప్రతిపాదన వల్ల మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయ రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు ఈ బడ్జెట్ శ్రీకారం చుడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఈ సందర్భంగా రైతులు చేస్తున్న ఆందోళనపై ప్రశ్నించగా, రైతులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కౌర్ సూచించారు. ఎంత పెద్ద సమస్యైనా సరే చర్చలతోనే పరిష్కారం సాధ్యపడుతుందని ఆమె అన్నారు. కొన్ని రాష్ట్రాలకే జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు వంటి మౌలిక వసతులు ఎక్కువగా కేటాయించారన్న విమర్శపై కూడా ఆమె స్పందించారు. ఆ రాష్ట్రాలకు ఇచ్చినందుకు సంతోషపడాలి తప్ప తప్పుబట్టడం సరికాదని అన్నారు. తమకూ కావాలని అడగడంలో తప్పులేదని, ఆ రాష్ట్రాలకు ఎందుకిచ్చారని ప్రశ్నించడం సమంజసం కాదని అన్నారు.