Union Budget 2023 Highlights: కొత్త ఆకాంక్షలు, కోటి ఆశలు.. కేంద్ర బడ్జెట్ పూర్తి వివరాలు..

Budget Session 2023 Parliament Highlights : తెలుగింటి కోడలు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు.

Union Budget 2023 Highlights: కొత్త ఆకాంక్షలు, కోటి ఆశలు.. కేంద్ర బడ్జెట్ పూర్తి వివరాలు..
Budget 2023

Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 01, 2023 | 6:39 PM

ఆర్థికమాంద్యం భయాల నడుమ పార్లమెంట్‌ ముందుకు రానుంది కేంద్ర బడ్జెట్‌. కాసేపట్లో లోక్‌సభలో 2023-2024ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు  తెలుగింటి కోడలు, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ఈ నేపథ్యంలో వివిధ రంగాలు, రాష్ట్రాలకు కేటాయింపులు ఎలా ఉంటాయోనని యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, ఇవాల్టి బడ్జెట్‌లో సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశాలుంటాయని తెలుస్తోంది.

కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో రాష్ర్టపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు నిర్మలా సీతారామన్‌. రాష్ట్రపతితో సమావేశం అనంతరం.. ప్రధాని అధ్యక్షతన కేంద్రమంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. అనంతరం లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్.

ఇక బడ్జెట్‌ ప్రవేశపెట్టేముందు తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావ్‌ కరద్‌. తమ పాలనలో అన్ని రంగాలూ అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Feb 2023 04:27 PM (IST)

    గరిష్టం నుంచి డౌన్.. బడ్జెట్ రోజు సెన్సెక్స్ ఇలా..

    బడ్జెట్ ప్రకటన రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బడ్జెట్‌పై ఆశలతో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు బడ్జెట్‌ ప్రసంగం ఆసాంతం అదే జోరును కొనసాగించాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 1,200 పాయింట్లకు పైగా లాభలో బాటలో పయనించింది. ఆదాయ పన్ను విధానంలో మార్పులు, మూలధన పెట్టుబడులకు కేటాయింపులు పెంచడం మదుపర్లను ఉత్సాహన్నిచ్చింది. అయితే, ఆ జోరు చివరి వరకు నిలవలేదు. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు చివరకు కిందకు దిగొచ్చాయి.

    ఉదయం సెన్సెక్స్‌ 60,001.17 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,773.44- 58,816.84 మధ్య కదలాడింది. చివరకు 158.18 పాయింట్ల లాభంతో 59,708.08 దగ్గర స్థిరపడింది.

    నిఫ్టీ 17,811.60 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 17,972.20- 17,353.40 మధ్య ట్రేడయింది. చివరకు 45.85 పాయింట్ల నష్టంతో 17,616.30 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.88 వద్ద ఉంది.

  • 01 Feb 2023 04:08 PM (IST)

    నిరాశజనకం.. ఎమ్మెల్పీ కవిత.

    కేంద్ర బడ్జెట్‌ నిరాశజనకంగా ఉందన్నారు ఎమ్మెల్పీ కవిత. చిన్న తరహా పరిశ్రమల ఊసే లేదని, ఆర్థిక మాంద్యం వల్ల వేలాది మంది ఉద్యోగాలు ఊడిపోతుంటే, వారి ఉద్యోగ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. స్మార్ట్‌ సిటీల గురించి బడ్జెట్‌లో ఏ ప్రస్తావన లేదన్నారు.


  • 01 Feb 2023 04:08 PM (IST)

    మంచి పరిణామం.. ఏపీ మంత్రి బుగ్గన

    మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే రుణానికి వడ్డీ చెల్లింపు పరిమితిని 50 ఏళ్లకు పెంచారని, ఇది అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉందన్నారు ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన. నర్సింగ్‌ కాలేజీల వల్ల కూడా అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయడం కూడా మంచి పరిణామం అన్నారు బుగ్గన.

  • 01 Feb 2023 03:12 PM (IST)

    కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు..

    • కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు
    • ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ.47 కోట్లు
    • ఏపీ పెట్రోలియం వర్సిటీకి రూ.168 కోట్లు
    • ఏపీ, తెలంగాణలోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు
    • విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.683 కోట్లు కేటాయింపు
    • మంగళగిరి, బీబీనగర్‌ ఎయిమ్స్‌లకు బడ్జెట్‌లో నిధులు
    • సింగరేణికి బడ్జెట్‌లో రూ.1,650 కోట్లు కేటాయింపు
    • ఐఐటీ హైదరాబాద్‌కు రూ.300 కోట్లు కేటాయింపు
    • సాలార్‌జంగ్‌ మ్యూజియాలకు రూ.357 కోట్లు
    • మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు
    • కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా రూ.41,338 కోట్లు
    • కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు
  • 01 Feb 2023 02:51 PM (IST)

    మహిళా సాధికారిత కోసం..

    గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.. మహిళా స్వయం సహాయక సంఘాలు వారి జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇళ్లలో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రత్యేక పొదుపు పథకం ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

  • 01 Feb 2023 02:45 PM (IST)

    తొలిసారిగా విశ్వకర్మ.. పథకం..

    దేశం కోసం కష్టపడి పనిచేసిన ‘విశ్వకర్మ’ ఈ దేశ సృష్టికర్త అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తొలిసారిగా ‘విశ్వకర్మ’ శిక్షణ, సహాయానికి సంబంధించిన పథకాన్ని బడ్జెట్‌లో తీసుకొచ్చినట్లు వివరించారు. PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ద్వారా సంపద్రాయ వృత్తుల వారికి చేయూతను అందించనున్నట్లు వివరించారు.

  • 01 Feb 2023 02:43 PM (IST)

    గొప్ప సంకల్పాన్ని నెరవేర్చే బడ్జెట్.. ప్రధాని మోడీ

    ఈ బడ్జెట్‌ భారత అభివృద్ధితోపాటు గొప్ప సంకల్పాన్ని నెరవేరుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించామని.. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు.

  • 01 Feb 2023 02:29 PM (IST)

    అందరి ఆకాంక్షల బడ్జెట్.. ప్రధాని మోడీ..

    బడ్జెట్‌లో అనేక ప్రోత్సహాకాలు ప్రకటించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అమృత్ కాల్ మొదటి బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి బలమైన పునాదిని నిర్మిస్తుందని మోడీ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులతో సహా అందరి ఆకాంక్షలను, కలలను నెరవేరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

  • 01 Feb 2023 02:17 PM (IST)

    అరుదైన ఘనత సాధించిన నిర్మలమ్మ..

    పార్లమెంటులో ఐదు సార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌, ఎక్కుసార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. కాగా ఈసారి ఆమె ప్రసంగం అతి తక్కువ సమయం కొనసాగింది. 1 గంట 26 నిమిషాల్లో ముగించారు. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారామె.

  • 01 Feb 2023 02:16 PM (IST)

    పీఎం అవాస్‌ యోజనకు 79 వేల కోట్లు..

    ఎన్నికల వేళ పేదల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం. పీఎం అవాస్‌ యోజనకు 79 వేల కోట్లు కేటాయించారు. రక్షణశాఖకు భారీ ఎత్తున 5.94 లక్షల కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. మహిళల కోసం మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ను ప్రారంభించారు. రెండేళ్ల పాటు ఈ స్కీము అందుబాటులో ఉంటుంది. 7.5 శాతం వడ్డీ చెల్లిస్తారు.

  • 01 Feb 2023 02:15 PM (IST)

    సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకంలో..

    సీనియర్‌ సిటిజన్స్‌కు కూడా బడ్జెట్‌లో ఆనందం కల్గించారు ఆర్థికమంత్రి. సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకంలో భాగంగా వారి డిపాజిట్‌ పరిమితిని పెంచారు. ప్రస్తుతం ఉన్న 15 రూపాయల నుంచి 30 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్‌

  • 01 Feb 2023 01:09 PM (IST)

    బడ్జెట్ ప్రసంగాన్ని దాదాపు 90 నిమిషాల్లో…

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని దాదాపు 90 నిమిషాల్లో పూర్తి చేసి దేశం ముందు న్యూ ఇండియా చిత్రాన్ని నిలిపారు.

  • 01 Feb 2023 01:08 PM (IST)

    ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద ఉపశమనం..

    కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ. 3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.6 నుంచి 9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం, రూ. 9 నుంచి 12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ. 12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం, రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం ఆదాయపు పన్ను ఉంటుంది.

  • 01 Feb 2023 01:07 PM (IST)

    పన్ను రిటర్నుల ప్రాసెసింగ్‌ను..

    పన్ను రిటర్నుల ప్రాసెసింగ్‌ను 90 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించామని.. ఒక్కరోజులోనే 72 లక్షల పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రి తెలిపారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారం మెరుగుపడింది. సాధారణ IT రిటర్న్ ఫారమ్‌లు వస్తాయి. ఇది రిటర్న్ ఫైలింగ్‌ను సులభతరం చేస్తుంది. 

  • 01 Feb 2023 01:05 PM (IST)

    రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు

    ఇకపై రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది కొత్త పన్ను విధానంలో ఇవ్వబడుతుంది. 

  • 01 Feb 2023 01:05 PM (IST)

    ఏది చౌక, ఏది ఖరీదైనది..

    బొమ్మలు, సైకిళ్ళు, ఆటో మొబైల్‌లు చౌకగా మారతాయి. కస్టమ్స్ సుంకాన్ని 13 శాతానికి పెంచారు. వివిధ మంత్రిత్వ శాఖల సిఫార్సుల తర్వాత ప్రభుత్వం 35 అంశాల జాబితాను సిద్ధం చేసింది. దిగుమతి సుంకాన్ని పెంచే వస్తువులు. వీటిలో ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ వస్తువులు, ఆభరణాలు, హై-గ్లోస్ పేపర్, స్టీల్ ఉత్పత్తులు, ఆభరణాలు, లెదర్, విటమిన్లు ఉన్నాయి. అదే సమయంలో, రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారం, మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇది దేశం నుండి ఆభరణాలు, ఇతర తుది ఉత్పత్తుల ఎగుమతిని పెంచడానికి సహాయపడుతుంది. గతేడాది బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలలో కస్టమ్స్ సుంకాలను ప్రభుత్వం రద్దు చేసింది.

  • 01 Feb 2023 12:39 PM (IST)

    సీనియర్‌ సిటిజన్లకు గుడ్ న్యూస్

    సీనియర్‌ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్‌ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్‌ చేసి, రూ.30లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.

  • 01 Feb 2023 12:28 PM (IST)

    ప్రత్యక్ష పన్ను..

    పన్ను రిటర్నుల ప్రాసెసింగ్‌ను 90 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించామని.. ఒక్కరోజులోనే 72 లక్షల పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రి తెలిపారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారం మెరుగుపడింది. సాధారణ IT రిటర్న్ ఫారమ్‌లు వస్తాయి. ఇది రిటర్న్ ఫైలింగ్‌ను సులభతరం చేస్తుంది.

  • 01 Feb 2023 12:27 PM (IST)

    ప్రత్యక్ష పన్నుపై..

    పన్ను పోర్టల్‌లో రోజుకు 72 లక్షల దరఖాస్తులు వస్తున్నాయని.. రీఫండ్ ప్రక్రియను 16 రోజుల వరకు తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందులో మరింత మెరుగుపడే దిశగా ముందుకు సాగుతున్నాం. 

  • 01 Feb 2023 12:18 PM (IST)

    మహిళల కోసం కొత్త పొదుపు పథకం..

    స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కింద మహిళా సమ్మాన్ బచత్ పత్రాన్ని ప్రకటిస్తున్నామని.. వారి కోసం కొత్త పొదుపు పథకం వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు.. దానిపై 7.5 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. ఏదైనా మహిళ లేదా అమ్మాయి ఖాతా తెరవగలరు. దాని నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు షరతులు ఉంటాయి. ఈ బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి ఇదో పెద్ద ముందడుగు.

  • 01 Feb 2023 12:16 PM (IST)

    MSMEలకు రూ. 2 లక్షల కోట్ల రుణం

    ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ప్రారంభించబడుతోంది. MSMEలకు రూ. 2 లక్షల కోట్ల రుణం ఇవ్వడానికి ప్రణాళిక ఉందన్నారు.

  • 01 Feb 2023 12:12 PM (IST)

    ఆర్థిక రంగంపై మోదీ సర్కార్ కీలక ప్రకటన

    సెబీని మరింత శక్తివంతం చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. SEBI డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ ఇవ్వగలదు. ఆర్థిక మార్కెట్లో ప్రజల భాగస్వామ్యం కోసం ఇది చేయబడుతుంది.

  • 01 Feb 2023 12:11 PM (IST)

    MSME కోసం కీలక ప్రకటన

    క్రెడిట్ గ్యారెంటీ ఎంఎస్‌ఎంఈలకు పునరుద్ధరణ పథకం వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 1 ఏప్రిల్ 2023 నుంచి పరిశ్రమలకు 9000 కోట్లు క్రెడిట్‌గా ఇవ్వబడుతుంది.

  • 01 Feb 2023 12:06 PM (IST)

    పొల్యూటెడ్‌ వెహికల్‌ అనబోయి.. పొలిటికల్‌ అనడంతో నవ్వులు..

    పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తున్నప్పుడు కొన్ని సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వాహనాల స్క్రాప్ విధానం గురించి ఆమె ప్రకటన చేస్తూ పొల్యూటెడ్‌ వెహికల్‌ అనబోయి.. పొలిటికల్‌ అని పలికారు. దీంతో అధికార సభ్యులతో పాటు, విపక్ష సభ్యులు ఒక్కసారిగా నవ్వేశారు. వెంటనే పొరపాటును గ్రహించిన నిర్మలా సీతారామన్‌ సైతం నవ్వుతూ పొరపాటును సవరించుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • 01 Feb 2023 12:00 PM (IST)

    యువతపై మోదీ సర్కార్ వరాలు..

    యువత కోసం స్కిల్ యూత్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, విదేశాల్లో ఉద్యోగాలు సాధించాలని కలలు కనే విద్యార్థుల కోసం 30 స్కిల్ ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నేరుగా సహాయం అందించబడుతుంది. ఫిన్‌టెక్ సేవలు పెంచబడతాయి, డిజి లాకర్ యుటిలిటీ చాలా పెరుగుతుంది మరియు ఇది అన్ని డిజిటల్ పత్రాలను కలిగి ఉంటుంది.

  • 01 Feb 2023 11:56 AM (IST)

    దేశ, విదేశీ పర్యాటకులు పర్యాటకంపై స్పెషల్ ఫోకస్..

    ప్రజలకు హరిత ఉద్యోగావకాశాలు కల్పించామని, దేశ, విదేశీ పర్యాటకులు పర్యాటకంలో గణనీయమైన సహకారం అందించారని ఆర్థిక మంత్రి అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ద్వారా టూరిజం ప్రమోషన్ కొత్త స్థాయికి తీసుకెళ్లబడింది. హైడ్రోజన్ మిషన్ కోసం ప్రభుత్వం రూ.19700 కోట్లు కేటాయించింది. మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు

  • 01 Feb 2023 11:50 AM (IST)

    గృహ కొనుగోలుదారులకు శుభవార్త..

    కొత్తగా ఇల్లు కొనుగోలు, నూతన గృహాలు నిర్మించుకునేవారి కోసం మోదీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పీఎం ఆవాస్‌ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్‌లో నిధులను భారీగా పెంచింది. గత బడ్జెట్‌లో పీఎం ఆవాస్‌ యోజనకు రూ. 48 వేల కోట్ల కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.

  • 01 Feb 2023 11:48 AM (IST)

    KYC ప్రక్రియ సులభతరం చేశాం – నిర్మలా సీతారామన్

    KYC ప్రక్రియ సులభతరం చేయబడుతుంది. ఆర్థిక వ్యవస్థతో మాట్లాడటం ద్వారా ఇది పూర్తిగా డిజిటలైజ్ చేయబడుతుంది. ఒక స్టాప్ పరిష్కారం. గుర్తింపు, చిరునామా కోసం చేయబడుతుంది. డిజి సర్వీస్ లాక్, ఆధార్ ద్వారా ఇది వన్ స్టాప్ సొల్యూషన్‌గా చేయబడుతుంది. అన్ని డిజిటల్ సిస్టమ్‌లకు పాన్ గుర్తించబడుతుంది. ఏకీకృత ఫైలింగ్ ప్రక్రియ సెటప్ చేయబడుతుంది. కామన్ పోర్టల్ ద్వారా ఒకే చోట డేటా ఉంటుంది. అది వివిధ ఏజెన్సీలు ఉపయోగించుకోగలుగుతుంది. పదే పదే డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే దీని కోసం వినియోగదారు సమ్మతి చాలా ముఖ్యం.

  • 01 Feb 2023 11:46 AM (IST)

    గిరిజన సమూహాల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు..

    PMBPTG డెవలప్‌మెంట్ మిషన్ ప్రత్యేకంగా గిరిజన సమూహాల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రారంభించబడుతుంది. తద్వారా PBTG నివాసాలకు ప్రాథమిక సౌకర్యాలు అందించబడతాయి. రూ. 15,000 కోట్లు వచ్చే 3 సంవత్సరాలలో ఈ పథకాన్ని అమలు చేయడానికి అందుబాటులో ఉంచబడతాయి.

  • 01 Feb 2023 11:45 AM (IST)

    ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు – నిర్మలా సీతారామన్

    ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు. ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్నామన్నారు. డిజిటల్‌ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కారాగాగాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక చేయూత అందిస్తాం.

  • 01 Feb 2023 11:43 AM (IST)

    రైల్వేలకు పెద్దపీట

    రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు ఇస్తున్నామని, ఇది రైల్వేకు అత్యధిక బడ్జెట్‌లో కేటాయించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది 2014లో కేటాయించిన బడ్జెట్‌ కంటే 9 రెట్లు ఎక్కువ అని వెల్లడించారు.

  • 01 Feb 2023 11:38 AM (IST)

    మూలధన వ్యయాన్ని పెంచాం – నిర్మలా సీతారామన్

    మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మా మూడవ ప్రాధాన్యత అని.. ప్రభుత్వం మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచిందని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు వీలుగా దీన్ని పెంచారు. ఇది ఉపాధికి దోహదపడుతుంది.

  • 01 Feb 2023 11:36 AM (IST)

    150కు పైగా మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చాం- నిర్మలా సీతారామన్

    2014 నుంచి దేశవ్యాప్తంగా 150కు పైగా మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చాం. త్వరలోనే ఐసీఎంఆర్‌ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం. వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం. అధ్యాపకుల శిక్షణకు డిజిటల్‌ విద్యావిధానం, జాతీయ డిజిటల్‌ లైబ్రరీ తీసుకొస్తాం.

  • 01 Feb 2023 11:35 AM (IST)

    ‘శ్రీఅన్న’ పథకం కోసం హైదరాబాద్‌ కేంద్రంగా రీసర్చ్

    గ్లోబల్ హబ్ ఫోర్ మిల్లెట్స్ కింద మిల్లెట్స్‌లో భారతదేశం చాలా ముందుంది. రైతులకు పౌష్టికాహారం, ఆహార భద్రత, ప్రణాళిక కోసం మిల్లెట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీఅన్నా రాడి, శ్రీఅన్నా బజ్రా, శ్రీఅన్నా రందానా, కుంగ్ని, కుట్టు అన్ని ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మినుముల్లో రైతుల సహకారం ఎంతో ఉందని, శ్రీ అన్నను హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. శ్రీఅన్న నిర్మాణానికి హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి చాలా సాయం అందుతోంది. 2023-24 సంవత్సరానికి రూ. 20 లక్షల కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించబడింది. వ్యవసాయ రంగానికి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.

  • 01 Feb 2023 11:30 AM (IST)

    క్రాఫ్ట్, ట్రేడ్‌లో పనిచేస్తున్నవారికి పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్

    త్వరలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారతదేశం @ 100 ద్వారా దేశం ప్రపంచవ్యాప్తంగా బలోపేతం అవుతుంది. గ్రామీణ మహిళల కోసం 81 లక్షల స్వయం సహాయక సంఘాలకు సహాయం లభించింది. ఇక ముందు ఇది మరింత పెరుగుతుంది. క్రాఫ్ట్, ట్రేడ్‌లో పనిచేస్తున్నవారికి, కళ, హస్తకళలకు సహకరించేందుకు పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ తీసుకొస్తున్నాం. స్వావలంబన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. దీని ద్వారా ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించి వారికి సామాజిక భద్రత కల్పించారు.

  • 01 Feb 2023 11:27 AM (IST)

    అణగారిన వర్గాలకు ప్రాధాన్యత – నిర్మలా సీతారామన్

    ఈ బడ్జెట్‌లో 7 ప్రాధాన్యతలు ఉంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌తో అగ్రి స్టార్టప్‌లు వృద్ధి చెందుతాయి. ఇది రైతులకు సహాయం చేస్తుంది. వారు సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. ఇది ఉత్పాదకతను పెంచుతుంది. ఇది రైతులు, రాష్ట్రం మరియు పరిశ్రమ భాగస్వామి మధ్య జరుగుతుంది. బడ్జెట్‌లో ప్రభుత్వం ఏడు ప్రాధాన్యతలను కలిగి ఉంది. అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ ప్రాధాన్యత.

  • 01 Feb 2023 11:26 AM (IST)

    విశ్వకర్మలకు ప్రత్యేక ప్రోత్సాహం – నిర్మలా సీతారామన్

    మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహిస్తాం. శతాబ్దాల తరబడి తమ స్వహస్తాలతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారిని విశ్వకర్మ అనే పేరుతో సంబోధిస్తున్నారు. తొలిసారిగా వారికి సహాయ ప్యాకేజీని నిర్ణయించారు. వాటిని MSME చైన్‌తో అనుసంధానించే పని జరుగుతుంది.

  • 01 Feb 2023 11:24 AM (IST)

    గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేశాం – నిర్మలా సీతారామన్

    గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేశాం. 2014 నుంచి నిరంతరంగా చేస్తున్న కృషి వల్ల ప్రపంచంలోనే 10 నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం.

  • 01 Feb 2023 11:21 AM (IST)

    పీఎం సురక్ష, పీఎం జీవన్ జ్యోతి యోజన ద్వారా.. -నిర్మలా సీతారామన్

    ప్రభుత్వం 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లను అందించాం. 44.6 కోట్ల మంది ప్రజలు పీఎం సురక్ష, పీఎం జీవన్ జ్యోతి యోజన ద్వారా పొందారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ ద్వారా ముందుకు సాగింది. 28 నెలల్లో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చాం అంటే చిన్న విషయం కాదన్నారు నిర్మలా సీతారామన్.

  • 01 Feb 2023 11:15 AM (IST)

    ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయింది – నిర్మలా సీతారామన్

    గత కొన్నేళ్లలో భారత ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయిందని ఆర్థిక మంత్రి తెలిపారు. తలసరి ఆదాయం ఏటా రూ.1.97 లక్షలకు చేరుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే మరింత వ్యవస్థీకృతమైంది. దీని ప్రభావం ప్రజల జీవన స్థితిగతులపై కనిపిస్తోంది.

  • 01 Feb 2023 11:14 AM (IST)

    ఉపాధి అవకాశాలను పెంపొందించాలనేది టార్గెట్ -నిర్మలా సీతారామన్

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు దాదాపు 7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ . ఉపాధి అవకాశాలను పెంపొందించాలనేది ప్రభుత్వ ప్రత్యేక దృష్టి. భారతదేశం నుండి G20 అధ్యక్ష పదవి ఒక పెద్ద అవకాశం. ఇది భారతదేశ బలాన్ని చూపుతుందన్నారు నిర్మలా సీతారామన్.

  • 01 Feb 2023 11:13 AM (IST)

    ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా – నిర్మలా సీతారామన్

    ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ ఉంటుందన్నారు నిర్మాల. తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపైందన్నారు. తొమ్మిదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందన్నారు. కొవిడ్ సమయంలోనూ ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాం. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది. వంద కోట్లమందికి 220 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించాం. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోంది.

  • 01 Feb 2023 11:09 AM (IST)

    అన్నివర్గాల సంక్షేమమే టార్గెట్.. – నిర్మలా సీతారామన్

    అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్‌అని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన స్వర్ణయుగంలో ఇదే తొలి బడ్జెట్ అని ఆర్థిక మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించారు. ముఖ్యంగా యువతకు, అన్ని తరగతుల ప్రజలకు ఆర్థిక బలాన్ని అందించేందుకు కృషి చేశామన్నారు. ప్రపంచంలో మందగమనం ఉన్నప్పటికీ, మన ప్రస్తుత వృద్ధి అంచనా దాదాపు 7 శాతంగా ఉంది. భారతదేశం సవాలు సమయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ అభివృద్ధిని మెచ్చుకున్నారు. ఈ బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలకు బ్లూ ప్రింట్. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచం భారతదేశ బలాన్ని గుర్తించింది.

  • 01 Feb 2023 11:04 AM (IST)

    2023-24 బడ్జెట్‌ను ఐదోసారి ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి

  • 01 Feb 2023 10:59 AM (IST)

    రైతులపై మోదీ వరాల జల్లు ఉండొచ్చు..

    కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని బడ్జెట్‌లో పెంచవచ్చని చెబుతున్నారు. రైతులు రూ. 6 వేలకు బదులు రూ. 8 వేలకు పెరగవచ్చు. దీని వల్ల 11 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది.

  • 01 Feb 2023 10:53 AM (IST)

    బడ్జెట్ ముందు బలపడిన రూపాయి విలువ..

    బడ్జెట్ 2023కి ముందు స్టాక్ మార్కెట్లలో బూమ్ కనిపిస్తోంది. ప్రీ-మార్కెట్ ఓపెనింగ్‌లో సెన్సెక్స్ 250 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 200 పాయింట్లు లాభపడింది. రూపాయి 15 పైసలు బలపడింది.

  • 01 Feb 2023 10:47 AM (IST)

    ప్రతి పౌరుడిలో టెన్షన్ టెన్షన్..

    బడ్జెట్‌ సమర్పణకు కేవలం 23 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆర్థిక మంత్రి ఖాతా నుంచి చివరకు తన వాటాలో ఏం వస్తుందోనని దేశంలోని ప్రతి పౌరుడు నిరీక్షణగా ఎదిరిచూస్తున్నాడు.

  • 01 Feb 2023 10:46 AM (IST)

    ప్రారంభమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం

    పార్లమెంట్‌ హౌస్‌లో కేంద్ర కేబినెట్‌ సమావేశం ప్రారంభం కాగా.. బడ్జెట్‌ తుది కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. సరిగ్గా 40 నిమిషాల తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మంచి బడ్జెట్ వస్తోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

  • 01 Feb 2023 10:45 AM (IST)

    పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రివర్గం ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే పార్లమెంటు భవనానికి చేరుకున్నారు మరియు సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • 01 Feb 2023 10:07 AM (IST)

    Budget Session 2023 Parliament LIVE: పార్లమెంట్‌కు చేరుకున్న ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

    బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్‌కు చేరుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ . ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి ఆర్థిక ఖాతాను ఇస్తారు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి ఉదయం 11 గంటలకు దేశ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

  • 01 Feb 2023 10:04 AM (IST)

    Budget Session 2023 Parliament LIVE: సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశాలుంటాయనే..

    వరుసగా ఐదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్‌. ఆర్థికమాంద్యం భయాల నడుమ పార్లమెంట్‌ ముందుకు రానుంది కేంద్ర బడ్జెట్‌. ఈ నేపథ్యంలో వివిధ రంగాలు, రాష్ట్రాలకు కేటాయింపులు ఎలా ఉంటాయోనని యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఇవాల్టి బడ్జెట్‌లో సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశాలుంటాయని తెలుస్తోంది.

  • 01 Feb 2023 09:57 AM (IST)

    Budget Session 2023 Parliament LIVE: రాష్ట్రపతితో ముగిసిన భేటీ.. బడ్జెట్‌కు అధికారిక ఆమోదం

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. బడ్జెట్‌ సమర్పణకు ముందు అనుసరించే సాధారణ ప్రక్రియ ఇది.

  • 01 Feb 2023 09:53 AM (IST)

    Budget Session 2023 Parliament LIVE: స్టాక్ మార్కెట్‌లో సూపర్ బూమ్

    బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన బూమ్ కనిపిస్తోంది. సెన్సెక్స్ 378.32 పాయింట్లు అంటే 0.64 శాతం లాభంతో 59,928.22 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 109.95 పాయింట్ల లాభంతో 0.62 శాతంతో 17,772.10 వద్ద కొనసాగుతోంది.

  • 01 Feb 2023 09:51 AM (IST)

    Budget Session 2023 Parliament LIVE: బడ్జెట్‌ ట్యాబ్‌తో రాష్ట్రపతి భవన్‌కు

    బడ్జెట్‌ 2023ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరికొద్దిసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ట్యాబ్‌తో నిర్మలా సీతారామన్ టీమ్ ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ముందుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. బడ్జెట్‌ గురించి రాష్ట్రపతికి పూర్తిగా వివరించారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • 01 Feb 2023 09:47 AM (IST)

    Budget Session 2023 Parliament LIVE: ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రత్యేక పూజలు..

    కేంద్ర బడ్జెట్ 2023ను ప్రవేశ పెట్టే ముందు ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్ ప్రార్థనలు చేశారు.

  • 01 Feb 2023 09:45 AM (IST)

    Budget Session 2023 Parliament LIVE: బడ్జెట్‌కి ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్‌‌లో జోష్..

    బడ్జెట్‌కి ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో జోష్ కనిపించింది. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

  • 01 Feb 2023 09:30 AM (IST)

    Budget Session 2023 Parliament LIVE: ఆర్థిక మంత్రి పూర్తి కార్యక్రమం ఇలా..

    ఆర్థిక మంత్రి కార్యక్రమాన్ని పరిశీలిస్తే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 8.40 గంటలకు నార్త్ బ్లాక్‌లోని కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు నార్త్ బ్లాక్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరుతారు. ఉదయం 9.45 గంటలకు బడ్జెట్ కాపీతో రాష్ట్రపతిని కలుస్తారు. ఉదయం 10 గంటలకు లెడ్జర్‌తో పార్లమెంటు భవనానికి చేరుకుంటారు. ఉదయం 10.15 గంటలకు క్యాబినెట్‌లో బడ్జెట్‌కు అధికారికంగా ఆమోదం లభించగానే 11 గంటలకు ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.