Budget 2022-Railways: కేంద్రం కీలక నిర్ణయం.. అన్ని ప్రాంతాలకు వందే భారత్‌ రైళ్లు..

|

Feb 01, 2022 | 1:17 PM

Vande Bharat trains: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌‌లో (Budget 2022) కీలక రంగాలపై దృష్టిసారించింది. ఈ సారి రైల్వే రంగంలో కీలక సంస్కరణలకు నాంది పలికింది.

Budget 2022-Railways: కేంద్రం కీలక నిర్ణయం.. అన్ని ప్రాంతాలకు వందే భారత్‌ రైళ్లు..
Vande Bharat Trains
Follow us on

Vande Bharat trains: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌‌లో (Budget 2022) కీలక రంగాలపై దృష్టిసారించింది. ఈ సారి రైల్వే రంగంలో కీలక సంస్కరణలకు నాంది పలికింది. ఈ ఆర్థిక ఏడాది కొత్త రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త రైళ్లు ప్రారంభించడం కంటే నూతన రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌ పనులపై ఎక్కువగా ఫోకస్‌ చేసింది. గతానికి భిన్నంగా ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా వందే భారత్‌ (Vande Bharat trains) రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు మంగళవారం బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఇప్పటికే వరుసగా 75 వారాల పాటు 75 వందే భారత్‌ రైళ్లను నడిపించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. వచ్చే మూడేళ్లల్లో 400 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

కొత్తగా వచ్చే వందే భారత్‌ రైళ్లను పూర్తిగా లింకే హఫ్‌ మన్‌ బుష్‌ (ఎల్‌ఎఫ్‌బీ) కోచ్‌లతో కేంద్రం రూపొందించబోతుంది. ప్రస్తుతం రాయ్‌బరేలీ, కపుర్తాల, చెన్నైలలో ఉన్న కోచ్‌ ఫ్యాక్టరీలలో ఎల్‌ఎఫ్‌బీ కోచ్‌లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు నగరాల నంచి దేశరాజధానికి వందే భారత్‌ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చే రైళ్లలో దక్షిణ భారతదేశంలోని పలుప్రాంతాలతోపాటు తెలంగాణ, ఏపీకి వాటా దక్కనుంది.

దీంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎరువుల సరఫరాకే రైల్వే నెట్‌వర్క్‌‌ను ఉపయోగిస్తున్నారు. కరోనా సంక్షోభం నాటినుంచి రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను పెద్ద ఎత్తున చేపట్టారు.

ప్రస్తుతం వీటి ఫలితాలు బాగుండటంతో ఈసారి చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే కార్గో సేవలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. పీఎం గతి శక్తి ద్వారా దేశవ్యాప్తంగా వంద కార్గో టెర్మినల్స్‌ నిర్మించబోతున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:

Budget 2022: క్రిప్టో కరెన్సీకి ఎదురు దెబ్బ..30 శాతం పన్ను విధింపు.. బడ్జెట్‌ సమావేశంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి

Budget 2022: పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే..