Budget 2022: ఈ సారి కూడా పూర్తిగా పేపర్‌లెస్ బడ్జెటే.. ఆ వేడుక రద్దు.. వివరాలివే..

|

Jan 28, 2022 | 12:11 PM

Budget 2022: దేశంలో కరోనావైరస్ (Coronavirus) థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కరోనావైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ అలజడి రేపుతోంది. జనవరి ప్రారంభం

Budget 2022: ఈ సారి కూడా పూర్తిగా పేపర్‌లెస్ బడ్జెటే.. ఆ వేడుక రద్దు.. వివరాలివే..
Budget 2022
Follow us on

Budget 2022: దేశంలో కరోనావైరస్ (Coronavirus) థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కరోనావైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ అలజడి రేపుతోంది. జనవరి ప్రారంభం నుంచి రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పైగా కేసులు నమోదవవుతున్నాయి. ఈ థర్డ్ వేవ్ భయాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్‌ (Budget 2022) ను గత ఏడాది మాదిరిగా పేపర్‌లెస్ (Paperless) ఫార్మాట్‌లో సమర్పించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ‘హల్వా’ (Halwa Ceremony) వేడుకను కూడా రద్దు చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.

కేంద్ర బడ్జెట్ 2022-23ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ .. 1 ఫిబ్రవరి, 2022న పేపర్‌లెస్ రూపంలో ప్రవేశపెడతారని.. యాప్ లో ఇది ప్రసారం అవుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం ప్రకటనలో తెలిపింది. 2021-22 లో యూనియన్ బడ్జెట్ మొదటిసారిగా పేపర్‌లెస్ రూపంలో ప్రవేశపెట్టారని తెలిపింది. పార్లమెంటు సభ్యులు (ఎంపీలు), సాధారణ ప్రజలు బడ్జెట్ పత్రాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా యాక్సెస్ చేయడానికి “యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్” కూడా ప్రారంభించినట్లు తెలిపింది. పార్లమెంట్‌లో 1 ఫిబ్రవరి 2022న బడ్జెట్ సమర్పణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర బడ్జెట్ 2022 -23 మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

బడ్జెట్ యాప్ ప్రకారం.. 14 యూనియన్ బడ్జెట్ పత్రాలకు పూర్తి ప్రాప్యతను అనుమతిస్తుంది. ఇందులో సీతారామన్ బడ్జెట్ ప్రసంగం, రాజ్యాంగం నిర్దేశించిన వార్షిక ఆర్థిక నివేదిక (సాధారణంగా బడ్జెట్ అని పిలుస్తారు), గ్రాంట్ల డిమాండ్ (DG), ఫైనాన్స్ బిల్లు, ఇతర అంశాలు ఉన్నాయి. మొబైల్ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. యాప్‌ను యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.indiabudget.gov.in) నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.indiabudget.gov.in)లో సామాన్య ప్రజలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి బడ్జెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

‘హల్వా’ వేడుక ఈ సంవత్సరంలో కూడా రద్దు చేశారు. దీనికి బదులుగా బడ్జెట్ పత్రాల ‘లాక్-ఇన్’ గుర్తుగా సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేయనున్నారు. అయితే.. బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో హల్వా వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అందరి ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేంద్ర బడ్జెట్ 2022ను (ఫిబ్రవరి 1న) మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. బడ్జెట్ ప్రెజెంటేషన్ వ్యవధి 90 నిమిషాల నుండి 120 నిమిషాల వరకు ఉండవచ్చు.

Also Read:

Rahul Gandhi: రాహుల్ ఆరోపణలు అర్ధరహితం.. సోషల్ మీడియాలో నెటిజన్ల రియాక్షన్స్ ఇవే..

School Reopen: త్వ‌ర‌లోనే దేశ వ్యాప్తంగా స్కూల్స్ పునఃప్రారంభం.. ఆ దిశ‌గా కేంద్రం అడుగులు..