Budget 2022: ఈ ఏడాది ‘ఆర్థిక సర్వే’ ఎంతో ప్రత్యేకం.. ఎందుకో తెలుసా?

|

Jan 31, 2022 | 9:31 AM

Economic Survey: దేశం ప్రస్తుతం ఆర్థిక రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ రోజు ఆర్థిక సర్వేను సమర్పించబోతున్నారు. అనేక సవాళ్లను ఎదుర్కోవటానికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో నేడు తెలియనుంది.

Budget 2022: ఈ ఏడాది ఆర్థిక సర్వే ఎంతో ప్రత్యేకం.. ఎందుకో తెలుసా?
Budget 2022
Follow us on

Economic Survey: ప్రతి సంవత్సరం బడ్జెట్ సెషన్‌లో సమర్పించే ఆర్థిక సర్వే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది దేశ ఆర్థికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరిస్తుంది. ఈసారి ఆర్థిక స‌ర్వే స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌గా ఉంది. బడ్డెట్ 2022(Budget 2022) ముందు సమర్పించే ఆర్థిక సర్వే ఈ సారి ఎందుకు భిన్నంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈసారి సర్వేను ఒకే సంపుటిలో సమర్పించనున్నారు. ఆర్థిక సర్వే(Economic Survey 2021-22) ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు రెండు సంపుటాలుగా సమర్పిస్తారు. ఆర్థిక సర్వేను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ బృందం తయారు చేస్తుంది. ఈ పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ, ఈసారి ఆర్థిక సర్వేను ఒకే సంపుటిలో అందించనున్నారు.

ఈ సంవత్సరం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్థిక సర్వేను సిద్ధం చేశారు. ఒక వాల్యూమ్‌లో ఉండటం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని వివిధ రంగాల డేటా మాత్రమే ఇందులో ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎదురవుతున్న అడ్డంకులను ఎలా ఎదుర్కొంటారనే దానిపై పూర్తి వివరణ ఈసారి ఆర్థిక సర్వేలో కనిపించకపోవచ్చు. సాధారణంగా, ఆర్థిక సర్వేలో వారు రాబోయే అడ్డంకులు, వాటిని ఎదుర్కోవటానికి రోడ్‌మ్యాప్ గురించి పూర్తి వివరాలను ఇది కలిగి ఉంటారు.

ఈరోజు కొత్త ఆర్థిక సలహాదారు విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు, కొత్త సీఈఏ అనంత్ నాగేశ్వరన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ఆర్థిక సర్వేలోని ప్రధాన అంశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మూడు రోజుల ముందు ప్రభుత్వం వి. అనంత నాగేశ్వరన్‌ను కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించింది.

ప్రధాన ఆర్థిక సలహాదారు లేకపోవడంతో ఆర్థిక సర్వేను సిద్ధం చేశారు. మాజీ CEA KV సుబ్రమణియన్ పదవీకాలం 6 డిసెంబర్ 2021న పూర్తయింది. దాంతో CEA పదవి ఖాళీగా ఉంది. ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరినీ నియమించలేదు. ఈ పదవిలో ఎవరిని నియమిస్తారో ఇంతవరకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు.

Also Read: Budget-2022: ఈ బడ్జెట్‌లో ఆ లాభాలపై పన్ను మినహాయిస్తారా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Budget 2022: స్టాక్ మార్కెట్ ఆదాయాలపై LTCG, STTలను తగ్గించనున్నారా.. ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్