Additional tax deduction in Buidget 2021: లోక్‌సభలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. ఇళ్లు కట్టుకునే వారికి తీపి కబురు అందించారు. గృహా రుణాలపై మంత్రి నిర్మలా కీలక ప్రకటన చేశారు. మార్చి 31, 2022 వరకూ గృహ రుణాలు తీసుకునేవారికి… అదనంగా మరో రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిజంగా ఇది రియల్ ఎస్టేట్ రంగానికి జోష్ తెచ్చే నిర్ణయం. అంతేకాదు… ఈ రంగంలో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
రియల్ ఏస్టేట్ రంగంతో పాటు గృహా నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు 2022 మార్చి 31 వరకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం దేశంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.అయితే, కరోనా వచ్చినప్పుడు ఈ రంగం కుదేలైంది. ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. నిర్మాణ కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కట్టిన ఇళ్లు కొనే పరిస్థితిలో ప్రజలు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ నిర్మాణ రంగం కోలుకుంటోంది. ఈ సమయంలో బడ్జెట్‌లో ప్రకటన ఈ రంగానికి మళ్లీ జోష్ తేనుంది.
Read Aslo… Union Budget 2021 Income Tax: ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు ప్రస్తావన లేని నిర్మలమ్మ బడ్జెట్