Budget 2021 – Stocks to Buy Today: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు కేంద్ర క్యాబినేట్ పార్లమెంటులో సమావేశమై వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సైతం ఆమోదించింది. ఈ తరుణంలో దేశీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 11 శాతం సాధిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే కేంద్ర బడ్జెట్ రోజున మార్కెట్ ఎక్స్‌పర్ట్స్, పలు సెక్టార్లు, స్టాక్ మార్కెట్స్ బడ్జెట్‌పై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.
బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ ఎలా కదులుతుందంటే… –
గత 11 సంవత్సరాలుగా పరిశీలిస్తే.. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ చాలా వరకు పతనమవుతూ వస్తోంది. 2012, 2013, 2014, 2016, 2018, 2020 బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు పతనంతో ముగిశాయి. వారంపాటు స్టాక్ మార్కెట్లల్లో హెచ్చుతగ్గులు నెలకొని ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్, స్థూల – ఆర్థిక గణాంకాలు, ఆర్‌బీఐ ద్రవ్య సమీక్ష వంటి ప్రధాన పరిణామాల కారణంగా మార్కెట్ అస్థిరంగా మారే అవకాశముందని పేర్కొంటున్నారు.
ఈ షేర్లపై నిఘా ఉంచండి..
సామ్కో సెక్యూరిటీస్, లార్సెన్ & టూబ్రో, గెయిల్, ఎన్‌టిపిసి, ఇండియన్ ఆయిల్, పిఎన్‌సి ఇన్‌ఫ్రాటెక్, హడ్కో, డాల్మియా ఇండియా లాంటి షేర్లపై నిఘా ఉంచాలని సీనియర్ అనలిస్ట్ నిరాలి షా తెలిపారు.
ఈ షేర్లకు ప్రయోజనం..
ప్రభుత్వం.. బడ్జెట్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై చేసే ప్రకటనల వల్ల ఎఫ్‌ఎంసిజి, వ్యవసాయం, సంబంధిత రంగాలు లాభపడే అవకాశముంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐసీసీఐ బ్యాంక్, కోరమాండల్ ఇంటర్నేషనల్, రాలిస్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాబర్ ఇండియా, ఎమామి, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభపడతాయని ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. అంతేకాకుండా సిమెంట్, వాణిజ్య కంపెనీలు, రియల్టీ కంపెనీ, ఆటో మొబైల్ కంపెనీలు లాభపడే సూచనలు ఉన్నాయని అనలిస్ట్ అజిత్ మిశ్రా తెలిపారు.
Also Read: