మరికాసేపట్లో పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

|

Feb 01, 2021 | 5:28 AM

కేంద్ర వార్షిక బడ్జెట్‌ మరికాసేపట్లో పట్టాలెక్కబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనేక అంచనాల మధ్య వస్తోన్న బడ్జెట్‌ బండి..

మరికాసేపట్లో పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌
Follow us on

కేంద్ర వార్షిక బడ్జెట్‌ మరికాసేపట్లో పట్టాలెక్కబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనేక అంచనాల మధ్య వస్తోన్న బడ్జెట్‌ బండి ప్రజల ఆశల్ని ప్రతిబింబిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ చాలా ప్రత్యేకం. కరోనా కుదుపుతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ సైతం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. బడ్జెట్‌ ముంగిట జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. జనవరిలో 1.2 లక్షల కోట్ల పన్ను వసూలైంది. కొవిడ్‌ ఎఫెక్ట్‌ను అధిగమిస్తూ జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. ఈ వసూళ్లను బట్టి ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోందంటున్నారు నిపుణులు.