ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో కోడెలపై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు.. కోడెల చొక్కాను చింపేశారు. దీంతో కోడెలతో పాటు గన్‌మెన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.