చంద్రబాబుపై వైసీపీ నేత బుగ్గన ధ్వజం

|

Mar 09, 2019 | 6:08 PM

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు భయపడి.. కాంప్రమైజ్‌ అయి హైదరాబాద్‌ నుంచి వచ్చేశానని ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పుకొచ్చారు. శనివారం నాడు హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. స్వార్థం కోసం చంద్రబాబు ప్రజల్ని బలిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీనే గజదొంగల పార్టీ.. వారి డేటాను దొంగిలించేవారు ఉన్నారా? అని బుగ్గన సెటైర్లేశారు. 3 కోట్ల మంది సమాచారం ప్రైవేటు సంస్థలకు ఎలా ఇస్తారు?అని టీడీపీ సర్కార్‌పై […]

చంద్రబాబుపై వైసీపీ నేత బుగ్గన ధ్వజం
Follow us on

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు భయపడి.. కాంప్రమైజ్‌ అయి హైదరాబాద్‌ నుంచి వచ్చేశానని ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పుకొచ్చారు. శనివారం నాడు హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. స్వార్థం కోసం చంద్రబాబు ప్రజల్ని బలిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీనే గజదొంగల పార్టీ.. వారి డేటాను దొంగిలించేవారు ఉన్నారా? అని బుగ్గన సెటైర్లేశారు. 3 కోట్ల మంది సమాచారం ప్రైవేటు సంస్థలకు ఎలా ఇస్తారు?అని టీడీపీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అది పార్టీ డేటానా..? లేక ప్రజల డేటానా..? అనేది చంద్రబాబు చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు.