టీఆర్ఎస్ ఓటేస్తే మోరీలో వేసినట్టే : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటేస్తే మోరీలో వేసినట్టేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు 13 మంది ఎంపీలు ఉన్నారని, వాళ్లు తెలంగాణకు సాధించిదేమీ లేదని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని కోరారు. ఈ ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన మాటలను ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. భారత దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేయాలని బీజేపీ […]

టీఆర్ఎస్ ఓటేస్తే మోరీలో వేసినట్టే : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2019 | 7:34 PM

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటేస్తే మోరీలో వేసినట్టేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు 13 మంది ఎంపీలు ఉన్నారని, వాళ్లు తెలంగాణకు సాధించిదేమీ లేదని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని కోరారు. ఈ ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన మాటలను ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. భారత దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దింపి రాహుల్ ని ప్రధానిని చేయాలంటూ ఉత్తమ్ ప్రజలను కోరారు.