మోదీ అంటేనే నమ్మక ద్రోహం: యనమల

అమరావతి: ఈ ఐదేళ్లలో విభజన చట్టాన్ని ఎంతవరకు అమలు చేశారని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. దీనిపై తెలుగుజాతికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. ఏ ఒక్క అంశాన్ని అయినా పూర్తిగా అమలు చేశారా అంటూ నిలదీశారు. చట్టానికి తూట్లు పొడిచే అధికారం వారికెక్కడిదని ధ్వజమెత్తారు. ఏపీకి నమ్మకద్రోహం చేస్తే వారికి ఏం లాభమో విశాఖలో అడుగు పెట్టేముందే ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలని యనమల డిమాండ్‌ చేశారు. మోసానికి ప్రతిరూపం.. నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం మోదీ అంటూ […]

మోదీ అంటేనే నమ్మక ద్రోహం: యనమల

Updated on: Mar 01, 2019 | 7:31 PM

అమరావతి: ఈ ఐదేళ్లలో విభజన చట్టాన్ని ఎంతవరకు అమలు చేశారని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. దీనిపై తెలుగుజాతికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. ఏ ఒక్క అంశాన్ని అయినా పూర్తిగా అమలు చేశారా అంటూ నిలదీశారు. చట్టానికి తూట్లు పొడిచే అధికారం వారికెక్కడిదని ధ్వజమెత్తారు. ఏపీకి నమ్మకద్రోహం చేస్తే వారికి ఏం లాభమో విశాఖలో అడుగు పెట్టేముందే ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలని యనమల డిమాండ్‌ చేశారు. మోసానికి ప్రతిరూపం.. నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం మోదీ అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.