AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌

ముంబయి: మూడు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ సూచీలు కోలుకుని వారాంతాన్ని లాభాలతో ముగించాయి. పాకిస్థాన్‌ అదుపులో ఉన్న భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అద్యంతం అదే జోరును కొనసాగించాయి. ఉదయం 200 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల అండతో దూసుకెళ్లింది. ఐటీ, […]

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌
Ram Naramaneni
|

Updated on: Mar 01, 2019 | 7:22 PM

Share

ముంబయి: మూడు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ సూచీలు కోలుకుని వారాంతాన్ని లాభాలతో ముగించాయి. పాకిస్థాన్‌ అదుపులో ఉన్న భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అద్యంతం అదే జోరును కొనసాగించాయి.

ఉదయం 200 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల అండతో దూసుకెళ్లింది. ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల్లో కొనుగోళ్లు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 196 పాయింట్లు లాభపడి 36,064 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 10,863.50 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.80 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, బీపీసీఎల్‌, ఐఓసీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌ఎసీ, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టపోయాయి.

Follow Us
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..