AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు అస్సలు రావు.. ఈ సూపర్ చిట్కాల గురించి తెలుసుకోండి..

వర్షాకాలం వస్తూ వస్తూనే తనతో పాటు దోమల బెడదను కూడా మోసుకొస్తుంది. ఇంట్లో ఒక్క దోమ ఉన్నా చాలు.. రాత్రంతా నిద్ర లేకుండా చేయడమే కాకుండా డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అయితే దోమలను తరిమేందుకు మార్కెట్లో దొరికే కెమికల్ కాయిల్స్ కంటే ఈ మొక్కలు పెంచితే అవి ఇంటి నుంచి పారిపోవడం పక్కా..

మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు అస్సలు రావు.. ఈ సూపర్ చిట్కాల గురించి తెలుసుకోండి..
How To Get Rid Of Mosquitoes Naturally
Krishna S
|

Updated on: Jun 28, 2026 | 12:16 PM

Share

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దోమలు పెద్ద సమస్యగా మారుతాయి. పగలు, రాత్రి తేడా లేకుండా చెవుల చుట్టూ తిరుగుతూ మనశాంతి లేకుండా చేస్తాయి. దోమకాటు వల్ల వచ్చే దురద, అలసట ఒకెత్తయితే.. డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పు మరొకెత్తు. వీటిని చంపడానికి మార్కెట్లో దొరికే రసాయన కాయిల్స్, అగరబత్తులు, స్ప్రేలు వాడటం వల్ల చాలామందికి శ్వాసకోశ సమస్యలు, తలనొప్పులు వస్తుంటాయి. అయితే ఎటువంటి కెమికల్స్ వాడకుండా సహజసిద్ధంగా దోమలను తరిమికొట్టడానికి ప్రకృతి మనకు అద్భుతమైన మొక్కలను ప్రసాదించింది. మీ ఇంటి బాల్కనీలో లేదా కుండీలలో ఈ మొక్కలను పెంచడం ద్వారా దోమలు రాకుండా ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

దోమలను రాకుండా చేసే అద్భుతమైన మొక్కలు..

తులసి:

సాధారణంగా ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఉంటుంది. మతపరమైన ప్రాధాన్యతతో పాటు తులసి ఘాటైన సువాసన దోమలను ఇళ్లకు దూరంగా ఉంచడంలో ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.

లావెండర్:

లావెండర్ మొక్క నుంచి వచ్చే ఆహ్లాదకరమైన పరిమళం ఇల్లంతా వ్యాపిస్తుంది. అయితే ఇందులోని సహజ నూనెలు దోమలకు అస్సలు పడవు. ఈ మొక్క తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షిస్తూనే దోమలను పారద్రోలుతుంది.

లెమన్ బామ్ :

పుదీనా జాతికి చెందిన ఈ మూలిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే సిట్రోనెల్లా అనే మూలకం దోమల నివారణలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. వైద్యంలో కూడా దీనిని సహజ ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు.

రోజ్మేరీ :

దీనిని కేవలం వంటల్లోనే కాకుండా దోమలను తరిమేందుకు కూడా ఉపయోగిస్తారు. బాగా ఎండిన రోజ్మేరీ పుల్లలను కాల్చడం వల్ల వచ్చే సువాసనతో ఇంట్లోని దోమలన్నీ పారిపోతాయి.

పుదీనా

పుదీనా తీక్షణమైన ఘాటు వాసన చాలా రకాల కీటకాలకు ప్రాణాంతకం. పెరట్లో లేదా బాల్కనీ కుండీల్లో పుదీనా మొక్క ఉంటే దోమలతో పాటు ఇతర హానికర పురుగులు కూడా ఇంటి దరిచేరవు.

నిమ్మగడ్డి

క్రిమికీటకాలను వికర్షించడంలో నిమ్మగడ్డిని బెస్ట్ రెమెడీగా చెబుతారు. దీని నుంచి వచ్చే సిట్రస్ సువాసన కారణంగా దోమలు ఆ ప్రాంతంలో అస్సలు నిలవలేవు.

వెల్లుల్లి మొక్క

వెల్లుల్లి ఘాటైన వాసనను దోమలు తట్టుకోలేవు. కుండీలో వెల్లుల్లిని పెంచడం వల్ల వంటలకూ వాడుకోవచ్చు, అలాగే ఇంటికి దోమల రక్షణ కూడా లభిస్తుంది.

దోమలను తరిమికొట్టే హోమ్‌మేడ్ సుగంధ దీపం

మొక్కలతో పాటు ఇంట్లోనే లభించే సహజ వస్తువులతో ఒక శక్తివంతమైన పొడిని తయారుచేసి, దీపం వెలిగించడం ద్వారా దోమలను పూర్తిగా అరికట్టవచ్చు.

కావలసిన వస్తువులు

గుప్పెడు ఎండిన ఉల్లిపాయ ముక్కలు లేదా ఎండిన బొప్పాయి తొక్కలు, 10 – 15 లవంగాలు, గుప్పెడు ఎండిన నిమ్మ ఆకులు, గుప్పెడు బిర్యానీ ఆకులు, 10 కర్పూర బిళ్లలు, ఆవ నూనె, కొద్దిగా ఉప్పు

తయారీ – ఉపయోగించే విధానం

పొడి సిద్ధం చేసుకోండి: ముందుగా ఎండిన నిమ్మ ఆకులు, ఉల్లిపాయ ముక్కలను మిక్సర్ జార్‌లో వేయండి. దానికి లవంగాలు, బిర్యానీ ఆకులు కూడా చేర్చి మెత్తని పొడిగా గ్రైండ్ చేయండి.

కర్పూరం కలపండి: చివరగా కర్పూరాన్ని బాగా నూరి, సిద్ధం చేసుకున్న పొడిలో కలపండి.

దీపం వెలిగించండి: ఇప్పుడు ఒక ప్రమిదలో ఆవ నూనె పోసి, అందులో కొద్దిగా ఉప్పు, మనం తయారు చేసుకున్న పొడిని వేసి కలపండి. సూర్యాస్తమయం అయ్యాక ఈ దీపాన్ని వెలిగించండి.

ఈ దీపం నుండి వచ్చే ఘాటైన సువాసన వల్ల ఇంట్లోని వాతావరణం శుద్ధి అవుతుంది. కర్పూరం, ఆవ నూనె, లవంగాల ప్రభావానికి దోమలు క్షణాల్లో ఇల్లు వదిలి పారిపోతాయి.

Follow Us
కీబోర్డ్‌పై అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవో తెలుసా..?
కీబోర్డ్‌పై అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవో తెలుసా..?
రోజ్‌మేరీ పువ్వుల సువాసనలోనే కాదు, ఆరోగ్యంలోనూ టాప్! ఈ ప్రయోజనాలు
రోజ్‌మేరీ పువ్వుల సువాసనలోనే కాదు, ఆరోగ్యంలోనూ టాప్! ఈ ప్రయోజనాలు
మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక..
మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక..
వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి మెస్సీ హిస్టారికల్ రికార్డ్
వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి మెస్సీ హిస్టారికల్ రికార్డ్
డిఫెన్స్‌ స్టాక్‌ దుమ్మురేపింది..రూ.1 లక్ష పెట్టుబడి రూ.24 లక్షలు
డిఫెన్స్‌ స్టాక్‌ దుమ్మురేపింది..రూ.1 లక్ష పెట్టుబడి రూ.24 లక్షలు
పెట్రోల్ బదులు బైక్‌లో డీజిల్ పోస్తే ఏం జరుగుతుంది..?
పెట్రోల్ బదులు బైక్‌లో డీజిల్ పోస్తే ఏం జరుగుతుంది..?
వైభవ్ ఎంట్రీపై ఐర్లాండ్ బౌలర్ జై మూంద్రా షాకింగ్ కామెంట్స్
వైభవ్ ఎంట్రీపై ఐర్లాండ్ బౌలర్ జై మూంద్రా షాకింగ్ కామెంట్స్
OTTలో మరో మలయాళం సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మరో మలయాళం సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్‌లోకి రోనాల్డో సేన
ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్‌లోకి రోనాల్డో సేన
అక్షయ పాత్ర రహస్యం తెలుసా? ద్రౌపది చివరి అన్నం మెతుకుతో శ్రీకృష్ణ
అక్షయ పాత్ర రహస్యం తెలుసా? ద్రౌపది చివరి అన్నం మెతుకుతో శ్రీకృష్ణ