19 ఏళ్ల యువకుడితో.. 45 ఏళ్ల మహిళ పరార్ అయిన ఘటన కర్ణాటక రాయ్‌చూర్ రూరల్‌లో చోటు చేసుకుంది. అయితే యువకుడి తల్లి మాత్రం.. మహిళే కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడి తల్లి నిర్మల ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఆమెకు నరేష్ అనే 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మహాబళేశ్వర సర్కిల్‌లో గల ఉడిపి హోటల్‌లో పని చేస్తున్న ఇతనికి.. అదే హోటల్‌లోని చంద్రిక(45) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వారి ప్రేమకు దారి తీసి.. ఇద్దరూ పరారయ్యారు.
అయితే.. చంద్రికే తన కొడుకు మాయమాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లిందని.. గత వారం రోజులుగా నరేష్ జాడ లేదని నిర్మల విలపిస్తూ.. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు. కాగా చంద్రికకు ముగ్గురు పిల్లలు, భర్త లోకేష్ ఉన్నారు. ఆయనను పోలీసులు విచారించగా.. తనకేమీ తెలియదని అంటున్నారు.
ఇది కూడా చదవండి: 19 ఏళ్ల యువకుడితో.. 45 ఏళ్ల మహిళ పరార్