మరోవారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. దారుణ హత్యకు గురైంది. బ్యాంకు ఉద్యోగినిగా పనిచేస్తున్న యువతిని.. ఆమె ఉండే గదిలోనే దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. బ్యాంక్ ఉద్యోగినిగా పనిచేస్తున్న ఓ ఇరవై ఐదేళ్ల యువతిని దుండుగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈనెల 26న సదరు యువతికి వివాహం జరగాల్సి ఉంది. స్థానికంగా ఉన్న ఏపీజీవీబీ బ్యాంకులో బాధిత యువతి ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. మృతురాలి స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.