భూ తగాదాలతో మహిళపై కత్తితో దాడి

|

Jul 08, 2020 | 1:36 PM

వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మరిచిన దుండగులు ఓ మహిళను విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భూ తగాదాలతో మహిళపై కత్తితో దాడి
Follow us on

వనపర్తి : జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మరిచిన దుండగులు ఓ మహిళను విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జిల్లాలోని గోపాలపేట మండలం బద్దారం గ్రామానికి చెందిన అర్రు రత్నమ్మ, అనంతరావు దంపతులకు అదే గ్రామానికి చెందిన మునుగాల అర్జున్ రావు, శేషమ్మ దంపతల మధ్య కొంతకాలంగా భూ తగదాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో బుధవారం ఇరు కుటుంబాల మధ్య గొడవ రాజుకుంది. దీంతో అర్రు రత్నమ్మ, అనంతరావు దంపతులపై మునుగాల అర్జున్ రావు, శేషమ్మ దాడి చేశారు. రత్నమ్మపై అర్జున్ రావు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రత్నమ్మను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.