అమరావతికి మించి కర్నూల్‌ను అభివృద్ధి చేస్తా: పవన్

కర్నూల్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలువురు స్టూడెంట్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విద్యార్ధులు కూడా పలు సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు రాష్ట్రానికి రాజధాని అమరావతి అయినా తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని అన్నారు. అమరావతికి మించి కర్నూల్‌ను తాను అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. […]

అమరావతికి మించి కర్నూల్‌ను అభివృద్ధి చేస్తా: పవన్

Updated on: Feb 25, 2019 | 4:53 PM

కర్నూల్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలువురు స్టూడెంట్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విద్యార్ధులు కూడా పలు సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు రాష్ట్రానికి రాజధాని అమరావతి అయినా తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని అన్నారు.

అమరావతికి మించి కర్నూల్‌ను తాను అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఎందరో రాజకీయ నాయకులు రాయలసీమ నుంచి ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, తాను రాయలసీమకు పూర్వ వైభవం తీసుకొస్తానని పవన్ చెప్పారు. తాను ఓట్లు అడిగేందుకు రాలేదని, మార్పు కోసమే వచ్చానని తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు.