నా భర్త ఆచూకీ కనిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటా

| Edited By:

Feb 26, 2019 | 12:31 PM

తన భర్త ఆచూకీని కనిపెట్టకపోతే పోలీస్‌స్టేషన్‌ ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో ఉన్న హెచ్‌ఎస్ఆర్‌ లేఔట్‌లో జై, జినిషా దంపతులు నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే ఈ ఇద్దరికి వివాహం కాగా.. ఏడాది వయసున్న బిడ్డ ఉంది. అయితే ఆరు నెలల క్రితం జై కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని జినిషా స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో […]

నా భర్త ఆచూకీ కనిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటా
Follow us on

తన భర్త ఆచూకీని కనిపెట్టకపోతే పోలీస్‌స్టేషన్‌ ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో ఉన్న హెచ్‌ఎస్ఆర్‌ లేఔట్‌లో జై, జినిషా దంపతులు నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే ఈ ఇద్దరికి వివాహం కాగా.. ఏడాది వయసున్న బిడ్డ ఉంది. అయితే ఆరు నెలల క్రితం జై కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని జినిషా స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతడి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఈ విషయాన్నే వారు జినిషాకు చెప్పారు. అయితే దీనిపై మనోవేదనకు గురైన జినిషా.. తన భర్తను వెతికి తనకు అప్పగించాలని, లేదంటే పోలీస్‌స్టేషణ్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.