మహిళా దినోత్సవం… విస్తారా కీలక నిర్ణయం

|

Mar 07, 2019 | 6:35 PM

ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. మార్చి 8నుంచి విస్తారా విమానాల్లో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు ఉచిత శానిటరీ నాప్‌కిన్లు సదుపాయాన్ని కల్పించనున్నారు. విస్తారాకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసుల్లో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ నుంచి ఈ సదుపాయాన్ని కల్పించనున్నామని విస్తారా ​కార్పొరేట్‌ వ్యవహరాల సీనియర్‌ వైస్‌ […]

మహిళా దినోత్సవం... విస్తారా కీలక నిర్ణయం
Follow us on

ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. మార్చి 8నుంచి విస్తారా విమానాల్లో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు ఉచిత శానిటరీ నాప్‌కిన్లు సదుపాయాన్ని కల్పించనున్నారు. విస్తారాకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసుల్లో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ నుంచి ఈ సదుపాయాన్ని కల్పించనున్నామని విస్తారా ​కార్పొరేట్‌ వ్యవహరాల సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపా చద్దా వెల్లడించారు. ఐఎస్ఓ 9001:2015 గుర్తింపు సాధించిన అత్యంత నాణ్యమైన శానిటరీ నాప్‌కిన్లు క్యాబిన్‌లో సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే శానిటరీ నాప్‌కిన్ల లభ్యతపై ‘అవసరం ఉన్న వారు విమాన సిబ్బందిని అడిగి వీటిని ఉచితంగా తీసుకోవచ్చంటూ’విమానాల్లో అనౌన్స్‌మెంట్‌కూడా ఉంటుందని సంస్థ వెల్లడించింది. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి విమానయాన సంస్థగా విస్తారా గుర్తింపు దక్కించుకోనుంది.