డాక్టర్ శ్రీరామ్.. మీరు స్ఫూర్తిదాయకం-ఉప రాష్ట్రపతి

కొవిడ్ కారణంగా చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ట్రాక్టర్‌పై తరలించిన డాక్టర్ పెండ్యాల శ్రీరామ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ..

డాక్టర్ శ్రీరామ్.. మీరు స్ఫూర్తిదాయకం-ఉప రాష్ట్రపతి

Updated on: Jul 14, 2020 | 2:44 PM

కొవిడ్ కారణంగా చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ట్రాక్టర్‌పై తరలించిన డాక్టర్ పెండ్యాల శ్రీరామ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లారు.  డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ చొరవను అభినందిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శ్రీరామ్ చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు అభిలషించారు.

కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లిన పెద్దపల్లి జిల్లా (తెలంగాణ) కరోనా నిఘా అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరాం గారి చొరవను అభినందిస్తున్నాను.