దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. ఇన్నాళ్లు మద్యం అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో.. సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే దాదాపు నలభై రోజులుగా మద్యం ముట్టకుండా ఉన్న వారంతా ఎప్పుడెప్పుడు తాగుదామా అన్న ఆతృతతో ఉన్నారు. అంతేకాదు.. తెల్లవారు జామునుంచే పలుచోట్ల మద్యం దుకాణాలు ముందు మందుకోసం క్యూ లైన్లు కడుతున్నారు. అయితే ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ సంఘటన.. మద్యం ప్రియుల కమిట్మెంట్‌ను తెలుపుతోంది. నైనిటాల్ ప్రాంతంలో ఓ మద్యం దుకాణం వద్ద భారీ లైన్ ఉంది. అయితే అదే సమయంలో భారీ ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసింది. ఈ క్రమంలో రోడ్లపై ఉన్న మద్యం కోనేందుకు వచ్చిన వారు.. భారీ లైన్లలో అలానే ఉన్నారు. మరికొందరు గోడుగులు పట్టుకుని లైన్‌లో నిల్చుంటే.. మరికొందరు మాత్రం రెయిన్‌కోట్స్ వేసుకుని మద్యం కోసం అదే వర్షంలో నిల్చున్నారు.
అయితే తొలుత భారీగా వర్షం పడుతుంటే.. మద్యం షాపు యజమాని కస్టమర్లు వెళ్లిపోతారని ఊహించారు. అయితే భారీ వర్షం పడుతున్నప్పటికీ.. మద్యం తీసుకెళ్లాలన్న కమిట్మెంట్‌తో వెనక్కు తగ్గలేదు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. దుకాణం ముందు గీసిన సర్కిళ్లలో సహనంతో నిల్చున్నారు. చివరకు మద్యం బాటిళ్లు చేతికి అందాక.. వారి ఫీలింగ్స్ చూస్తూ బిత్తెరపోయారు షాపు యజమానులు.