లంచం ఇస్తాను.. ప్రమోషన్ ఇవ్వండి.. ఓ ప్రబుద్దుడి నిర్వాకం.!

|

Feb 21, 2019 | 2:13 PM

ఒక వ్యక్తి నేరుగా ప్రజారోగ్యశాఖ సంచాలకుడికే లంచం ఇస్తానన్నాడు. అలా అని చెప్పి ఆయన ఫోన్ కి సందేశాలు పంపాడు. ఈ ఉదంతమంతా వైద్య- ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి దృష్టికి వెళ్లడంతో ఆ ప్రబుద్ధుడు మంగళవారం సస్పెండ్ అయ్యాడు. అసలు వివరాల్లోకి వెళ్తే వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్యశాఖలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 గా పని చేసే బత్తిని సత్యనారాయణ గౌడ్… ప్రజాఆరోగ్య డైరెక్టర్ జి.శ్రీనివాసరావుకు 5 లక్షలు లంచం ఇవ్వాలనుకున్నాడు. అదేపనిగా […]

లంచం ఇస్తాను.. ప్రమోషన్ ఇవ్వండి.. ఓ ప్రబుద్దుడి నిర్వాకం.!
Follow us on

ఒక వ్యక్తి నేరుగా ప్రజారోగ్యశాఖ సంచాలకుడికే లంచం ఇస్తానన్నాడు. అలా అని చెప్పి ఆయన ఫోన్ కి సందేశాలు పంపాడు. ఈ ఉదంతమంతా వైద్య- ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి దృష్టికి వెళ్లడంతో ఆ ప్రబుద్ధుడు మంగళవారం సస్పెండ్ అయ్యాడు. అసలు వివరాల్లోకి వెళ్తే వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్యశాఖలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 గా పని చేసే బత్తిని సత్యనారాయణ గౌడ్… ప్రజాఆరోగ్య డైరెక్టర్ జి.శ్రీనివాసరావుకు 5 లక్షలు లంచం ఇవ్వాలనుకున్నాడు. అదేపనిగా మంగళవారం ఆయన మొబైల్ కు ఎస్.ఎమ్.ఎస్ లు పంపించాడు.     

సర్.. మీకు ఒక విన్నపం. మెడికల్ సోషల్ వర్కర్ పదోన్నతులు పరంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో. వారిద్దరికీ మాత్రమే మీరు చొరవ తీసుకుని ప్రమోషన్ ఇస్తే.. మీకు 5 లక్షలు ఏర్పాటు చేస్తాను. ఎవరిని నమ్మలేక, తప్పనిసరి పరిస్థితులలో మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా. అన్యధా భావించద్దు సర్ దయచేసి. ఎన్నికల కోడ్ వస్తుందని భయపడుతున్నారు వాళ్ళు. తర్వాత ఎవరైనా సీనియర్స్ వస్తే వారికీ రాదని భయపడుతున్నారు’ అని మూడు సందేశాలు శ్రీనివాసరావు మొబైల్ కు పంపాడు సత్యనారాయణ గౌడ్ ! ఇది మొత్తం తతంగం ఉన్నతాధికారుల కంట పడడంతో తక్షణమే అతడిని సస్పెండ్ చేశారు. ‘ప్రజారోగ్య విభాగంలో అవినీతిని అరికట్టడానికి పలు చర్యలు తీసుకుంటున్నాం అని.. అలాంటి పనులు చేసే ఎవరిని ఉపేక్షించబోమని’ డీఎచ్ ప్రకటించారు.