‘ఆ ఇద్దరు అధికారులు పాకిస్తాన్ ఐఎస్ఐ కస్టడీలో ?’

ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు పాక్ ఐఎస్ఐ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే..

ఆ ఇద్దరు అధికారులు పాకిస్తాన్ ఐఎస్ఐ కస్టడీలో ?

Edited By:

Updated on: Jun 15, 2020 | 5:46 PM

ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు పాక్ ఐఎస్ఐ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. వీరి మిస్సింగ్ పై భారత ప్రభుత్వం పాకిస్తాన్ సర్కార్ కి ఫిర్యాదు చేసింది. అలాగే ఢిల్లీలోని పాక్ హైకమిషన్ దౌత్యాధికారి సయ్యద్ హైదర్ షా ని విదేశాంగ శాఖ పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. కాగా-ఆ ఇద్దరు అధికారులు కారని…. భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న డ్రైవర్లని కూడా అంటున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us