డేటా వివాదంపై హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌

|

Mar 09, 2019 | 12:53 PM

హైదరాబాద్‌: డేటా వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని ఆ సంస్థ సీఈవో అశోక్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా.. దీనిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ […]

డేటా వివాదంపై హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌
Follow us on

హైదరాబాద్‌: డేటా వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని ఆ సంస్థ సీఈవో అశోక్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా.. దీనిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని, అప్పటివరకు ఈ కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అశోక్‌ కోరినట్టు తెలుస్తోంది. ఈ పిటిషన్‌ శనివారం లేదా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పిటిషన్‌లో తెలంగాణ పోలీసులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.తాము ఎలాంటి డేటా దుర్వినియోగానికి పాల్పడలేదని, వ్యాపారపరమైన లావాదేవీలు మాత్రమే చేసినట్టు అశోక్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం.