ఎవరికి ఓటేస్తారు.? హరీశ్ రావు సూటిప్రశ్న

|

Sep 24, 2020 | 2:56 PM

‘బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టి బిల్ కలెక్టర్లతో.. బిల్లు వసూళ్లకు పెడతారట.! మీటర్లు కావాలంటే.. బీజేపీకి ఓటు వేయండి. మీటర్లు వద్దంటే.. మన కేసీఆర్ సారూ.. టీఆర్ఎస్ కారు పార్టీకే ఓటు వేయాలి’ అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. ‘ఎకరానికి యేటా పెట్టుబడి సాయం కింద 10 వేల రూపాయలు సాయం చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఈ విధంగా 28 రాష్ట్రాలలో ఎక్కడైనా ఇస్తున్నారా?’ అని ఆయన […]

ఎవరికి ఓటేస్తారు.? హరీశ్ రావు సూటిప్రశ్న
Follow us on

‘బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టి బిల్ కలెక్టర్లతో.. బిల్లు వసూళ్లకు పెడతారట.! మీటర్లు కావాలంటే.. బీజేపీకి ఓటు వేయండి. మీటర్లు వద్దంటే.. మన కేసీఆర్ సారూ.. టీఆర్ఎస్ కారు పార్టీకే ఓటు వేయాలి’ అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. ‘ఎకరానికి యేటా పెట్టుబడి సాయం కింద 10 వేల రూపాయలు సాయం చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఈ విధంగా 28 రాష్ట్రాలలో ఎక్కడైనా ఇస్తున్నారా?’ అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ, రైతు ప్రభుత్వమని, బీజేపీ రైతు వ్యతిరేక చట్టాన్ని అమలు చేస్తున్న విధానం నచ్చక కేంద్రమంత్రి రాజీనామా చేశారని హరీశ్ రావు స్పష్టం చేశారు.

సిద్దిపేట జిల్లా రాయపూర్ మండల కేంద్రంలో 266 మంది రైతులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు. 1బీ కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రైతుల సమయం వృథా కావొద్దని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చామని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, 6 ఏళ్లుగా రైతు శ్రేయస్సు కోసం పని చేస్తున్నదని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.