వెస్ట్ బెంగాల్.. కరోనాతో ప్రముఖ డాక్టర్ మృతి… దీదీ సంతాపం

| Edited By: Anil kumar poka

Apr 26, 2020 | 6:54 PM

పశ్చిమ బెంగాల్ లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ విప్లబ్ కాంతి దాస్ గుప్తా  కరోనా వ్యాధితో మృతి చెందారు. గతవారంలో    కరోనా పాజిటివ్ లక్షణాలు సోకిన ఈయన చికిత్స పొందుతూ మరణించారు.  కరోనాతో బాధ పడుతున్న ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు...

వెస్ట్ బెంగాల్.. కరోనాతో ప్రముఖ డాక్టర్ మృతి... దీదీ సంతాపం
Follow us on

పశ్చిమ బెంగాల్ లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ విప్లబ్ కాంతి దాస్ గుప్తా  కరోనా వ్యాధితో మృతి చెందారు. గతవారంలో    కరోనా పాజిటివ్ లక్షణాలు సోకిన ఈయన చికిత్స పొందుతూ మరణించారు.  కరోనాతో బాధ పడుతున్న ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్ హెల్త్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన విప్లబ్ కాంతి దాస్ గుప్తా   మృతి పట్ల  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. రోగులకు ఆయన చేసిన సేవలు మరువరానివని  ఆమె ట్వీట్ చేశారు. వెస్ట్ బెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ కూడా ఒక ప్రకటనలో విప్లబ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలో వైద్య సిబ్బందికి కిట్స్ . మాస్కులు వంటివాటి కొరత తీవ్రంగా ఉందని పేర్కొంది. తమకు మరిన్ని టెస్టింగ్ సౌకర్యాలు అవసరమని ఈ ఫోరమ్ సభ్యులు అభ్యర్థించారు. పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు 600 నమోదు కాగా.. 18 మంది రోగులు మృతి చెందారు.