గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నేతలతో ఇవాళ సీఎం మీటింగ్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ అధినేత కసరత్తు ప్రారంభించారు. గుంటూరు లోక్ సభ స్థానం పరిధిలోని తెలుగుదేశం పార్టీ నేతలతో సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చర్చలు జరపనున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్‌, తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా ఆలపాటి రాజా, పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర పేరు ఇప్పటికే ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన తాడికొండ, […]

గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నేతలతో ఇవాళ సీఎం మీటింగ్

Edited By:

Updated on: Mar 03, 2019 | 9:13 AM

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ అధినేత కసరత్తు ప్రారంభించారు. గుంటూరు లోక్ సభ స్థానం పరిధిలోని తెలుగుదేశం పార్టీ నేతలతో సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చర్చలు జరపనున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్‌, తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా ఆలపాటి రాజా, పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర పేరు ఇప్పటికే ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ స్థానాలపై చంద్రబాబు కసరత్తు చేయనున్నారు.