నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. దోషుల ఉరితీత వాయిదా !

| Edited By:

Jan 16, 2020 | 5:31 PM

నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షను వాయిదా వేయాలని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ దోషుల్లో ఒకరి మెర్సీ పిటిషన్ నేపథ్యంలో కొత్త తేదీని నిర్ణయించాలని వారు ఓ లేఖలో అభ్యర్థించారు. మరోవైపు.. ఢిల్లీ కోర్టు వీరి ఉరిశిక్షపై గురువారం స్టే విధించింది. అటు దోషుల డెత్ వారెంట్‌కు సంబంధించి తన ఉత్తర్వులను రివ్యూ చేయడంలేదని, అయితే క్షమాభిక్ష పిటిషన్ కారణంగా వీరి ఉరిశిక్షపై స్టే ఉండాలని తిస్ హజారీ కోర్టు జడ్జి ఒకరు […]

నిర్భయ కేసులో మరో ట్విస్ట్..  దోషుల ఉరితీత వాయిదా !
Follow us on

నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షను వాయిదా వేయాలని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ దోషుల్లో ఒకరి మెర్సీ పిటిషన్ నేపథ్యంలో కొత్త తేదీని నిర్ణయించాలని వారు ఓ లేఖలో అభ్యర్థించారు. మరోవైపు.. ఢిల్లీ కోర్టు వీరి ఉరిశిక్షపై గురువారం స్టే విధించింది. అటు దోషుల డెత్ వారెంట్‌కు సంబంధించి తన ఉత్తర్వులను రివ్యూ చేయడంలేదని, అయితే క్షమాభిక్ష పిటిషన్ కారణంగా వీరి ఉరిశిక్షపై స్టే ఉండాలని తిస్ హజారీ కోర్టు జడ్జి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నెల 22 న ఈ దోషులను ఉరి తీయడంలేదని జైలు అధికారులు తనకు రిపోర్టు ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు. కాగా అసలు మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో లేదని నిర్భయ తలిదండ్రుల తరఫు న్యాయవాది సీమా కుష్వాలా పేర్కొన్నారు. దాన్ని కేవలం దాఖలు చేయడం జరిగిందని, అసలు ఆ పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపారా లేదా అన్న విషయం తెలియదని అన్నారు.