Shocking news ఒక్క పిల్లాడి కోసం ముగ్గురు యువతులు..చివరికి ఊపిరాడక..!

ఓ పదేళ్ళ పిల్లాడి కోసం ముగ్గురు యువతులు తాపత్రయ పడిన దారుణ ఉదంతం ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో జరిగింది. బుధవారం వెలుగు చూసిన ఈ దారుణ ఉదంతంలో చివరికి ముగ్గురు యువతులు ఊపిరి ఆడక మృత్యువాత పడ్డారు.

Shocking news ఒక్క పిల్లాడి కోసం ముగ్గురు యువతులు..చివరికి ఊపిరాడక..!

Updated on: May 13, 2020 | 7:55 PM

Three women died for a 10-yr old boy: ఓ పదేళ్ళ పిల్లాడి కోసం ముగ్గురు యువతులు తాపత్రయ పడిన దారుణ ఉదంతం ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో జరిగింది. బుధవారం వెలుగు చూసిన ఈ దారుణ ఉదంతంలో చివరికి ముగ్గురు యువతులు ఊపిరి ఆడక మృత్యువాత పడ్డారు. దాంతో తిమ్మసముద్రంలో ప్రజలు నివ్వెర పోయారు.

ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో విషాదం చోటు చేసుకుంది. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం శివారులో చెరువులో మునిగిపోతున్న పదేళ్ళ బాలుడ్ని కాపాడబోయి ముగ్గురు యువతులు మృత్యువాత పడ్డారు. నీటిలో మునిగిపోతున్న బాలుడిని రక్షించేందుకు యత్నించి చివరికి వారే నీట మునిగి మృతి చెందారు. మృతులను తిమ్మసముద్రం గ్రామానికి చెందిన 25 ఏళ్ళ వేదిక, 19 ఏళ్ళ మాధవి, 19 ఏళ్ళ సుభాషిణిగా గుర్తించారు.

తిమ్మసముద్రం గ్రామం సమీపంలోని నీటి చెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్ళిన ముగ్గురు యువతులు నీటిలో పడి మునిగిపోతున్న పదేళ్ళ బాలుడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నంలో బాలుడ్ని రక్షించ గలిగారు కానీ తమను తాము కాపాడుకోలేకపోయారు. ముగ్గురు యువతులు నీటిలో మునిగి పోయారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఊపిరాడక ముగ్గురు యువతులు చనిపోయారు. వీరిలో వేదిక అనే యువతి కానిస్టేబుల్‌ భార్య కాగా.. మృతులంతా ఒకరొకరు బంధువులవుతారు. ప్రస్తుతం తిమ్మసముద్రం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Follow Us