ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

| Edited By:

May 15, 2020 | 1:45 PM

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. జులై 10 నుంచి 15వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను..

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!
Follow us on

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. జులై 10 నుంచి 15వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ సారి టెన్త్ విద్యార్థులకు కేవలం ఆరు పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. లాక్‌డౌన్‌తో 11 పేపర్లను.. ఆరుకి కుదించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఏ రోజు ఏ పరీక్ష జరగనుందో కూడా తెలిపింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇక ఈ పరీక్షల టైమింగ్ విషయానికొస్తే.. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలై.. మధ్యాహ్నం 12.45 గంటలకు ముగియనుంది.

పదో తరగతి పరీక్షల వివరాలు:

– జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్
– జులై 11న సెకండ్ లాంగ్వేజ్
– జులై 12న ఇంగ్లీష్ పరీక్ష
– జులై 13న మ్యాథ్స్ పరీక్ష
– జులై 14న సైన్స్ పరీక్ష
– జులై 15న సోషల్ పరీక్ష

Read More:

లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా.. ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్

గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపా? సడలింపా?